Begin typing your search above and press return to search.
'కిరాక్' సౌండ్ రావడం లేదే
By: Tupaki Desk | 13 March 2018 3:32 AM GMTనిఖిల్ హీరోగా రూపొందిన కిరాక్ పార్టీ విడుదలకు మూడు రోజుల సమయం మాత్రమే చేతిలో ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ తిరిగి యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం తప్ప పెద్దగా ప్రమోషన్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. మ్యూజిక్ ఆల్బం విడుదలైనా ఒకటి అరా తప్ప ఏమంత గొప్పగా లేదనే టాక్ ఇప్పటికే బయటికి వచ్చింది. ఈ నేపధ్యంలో దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ కి కారణం కేవలం కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలవడమొకటే కనిపిస్తోంది. ఒక బాషలో హిట్ అయిన సినిమా రీమేక్ వెర్షన్ ఇంకో బాషలో కూడా అదే స్థాయిలో ఆడుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. గతంలో కన్నడలో ఇండస్ట్రీ రికార్డ్స్ సాధించిన 'యోగి' తెలుగు లో డిజాస్టర్ అయ్యింది. అక్కడ చరిత్రగా చెప్పుకున్న 'ఓం' ఇక్కడ ఫ్లాప్ అనే ముద్ర వేసుకుంది. అలా హిట్ అయిన సినిమాలు లేవని కాదు. కాని కిరాక్ పార్టీ విషయం వేరు. ఇది పూర్తిగా యూత్ ని బేస్ చేసుకుని తీసిన కాలేజీ పాలిటిక్స్ మూవీ.
పోటీ లేకపోవడాన్ని కిరాక్ పార్టీ పూర్తిగా సద్వినియోగపరుచుకోవడం లేదు. చాలా చప్పగా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ అదే ఆడుతుంది అనే ధోరణి ప్రదర్శించడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. టీజర్ మొదలుకొని ట్రైలర్ దాకా అన్ని హ్యాపీ డేస్ సినిమానే గుర్తుకు తెచ్చేలా ఉండటం కొద్దిగా మైనస్ గా మారుతోంది. విస్తృతంగా ప్రమోట్ చేస్తేనే ఓపెనింగ్స్ కష్టమైన తరుణంలో కేవలం నిఖిల్ ఇమేజ్ యూత్ సినిమా అనే స్టాంప్ దీనికి సరిపోదు. పైగా పోటీగా ఉన్న నయనతార డబ్బింగ్ సినిమా కర్తవ్యం నిర్మాతలు చాలా తెలివిగా నిన్న అంటే నాలుగు రోజులు ముందే మీడియా షో వేసి మూవీ కంటెంట్ ని చూపించేసారు. అందులో నిజంగానే మెప్పించే విషయం ఉండటంతో అప్పుడే పాజిటివ్ రివ్యూలు మొదలైపోయాయి. ఈ నేపధ్యంలో కిరాక్ పార్టీ వ్యవహార శైలి కాస్త తేడాగానే ఉంది.
కిరాక్ పార్టీ ఒరిజినల్ వెర్షన్ చూసినా ఇదేమంత అత్యత్భుతమైన కథా కథనాలు ఉన్న సినిమా కాదు. ఒక సింపుల్ కూల్ యూత్ స్టొరీ అంతే. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాలేజీ పాలిటిక్స్ జోడించి కొత్తగా ట్రై చేసారు. అక్కడైనా మెట్రోస్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మాస్ ని పూర్తిగా చేరలేకపోయింది. సో కిరాక్ పార్టీ కిక్ రావాలంటే ఇప్పుడున్న డోస్ సరిపోదు. ఈ మాత్రం సౌండ్ కే ఓపెనింగ్స్ అదిరిపోతాయి అనుకోవడం కూడా తప్పుడు లెక్కే. పైగా ఆ తరువాతి శుక్రవారం నుంచి క్రేజీ సినిమలు క్యు కట్టాయి. మరి కిరాక్ సౌండ్ పెంచాల్సిన టైం వచ్చేసింది కాని సౌండ్ అయితే గట్టిగా వినిపించడం లేదు