Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అబ్బాయిలు 100 % అదే అలోచిస్తారట!
By: Tupaki Desk | 14 Nov 2018 12:06 PM GMTతమన్నా - సందీప్ కిషన్లు జంటగా నటిస్తున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'. 'హమ్ తుమ్' 'ఫనా' లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కొహ్లి ఈ సినిమాకు డైరెక్టర్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఒక నిముషం రెండు సెకన్ల టీజర్లో సందీప్ కిషన్ ను ఒక ప్లే బాయ్ లాగా చూపించారు. ఇక తమన్నాను ఆ ప్లేబాయ్ ప్రేమలో పడే అమ్మాయిలా చూపించారు.
ఈ జెనరేషన్ సినిమా కాబట్టి డైలాగులు కూడా కాస్త ఓపెన్ గానే ఉన్నాయి. "అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు.. దాని గురించేనా లైక్ 24X7?" అని తమన్నా నవదీప్ ను అడిగితే "100%" అని అని క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇక ఆ ప్రశ్నకు ఈ జవాబుకు మధ్యలో సందీప్ కిషన్ అమ్మాయిలతో సరసలాడుతూ "నీకు తెలీదా" అంటాడు. ఇక ప్లేబాయ్ అయిన సందీప్ తన రొమాన్స్ ఫిలాసఫీ ని ఫ్రెండ్స్ తో చెబుతూ కనిపిస్తాడు. లైఫ్ చాలా చిన్నదని.. అమ్మాయిల విషయంలో అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని "దట్ వన్ ఛాన్స్.. గ్రాబ్ ఇట్" అంటూ వాళ్ళను ఇన్స్పైర్ చేస్తుంటాడు.
సినిమా మెజారిటీ భాగాన్ని లండన్ లో చిత్రీకరించడంతో విజువల్స్ లో రిచ్ లుక్ ఉంది. మనీష్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం కూడా స్టొరీకి తగ్గట్టు ఇంప్రెసివ్ గా ఉంది. టీజర్ లో ఉన్న "ఓ నో నెవర్ ' పాట కూడా ట్రెండీగా ఉంది. నవదీప్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. తమన్నా లుక్ మాత్రం అంత ఇంప్రెసివ్ గా లేదు. ఓవరాల్ గాటీజర్ ను బట్టి సినిమా కాన్సెప్ట్ చూస్తే డిఫరెంట్ అని చెప్పలేం. ఎందుకంటే ప్లేబాయ్ కి హీరోయిన్ పడే కాన్సెప్ట్ తో గతంలో సినిమాలు వచ్చాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటే మాత్రం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. టీజర్ పై ఓ లుక్కేయండి.