Begin typing your search above and press return to search.

సినిమా థియేటర్లన్నీ అప్పుడే తెరుస్తారట..!

By:  Tupaki Desk   |   24 May 2020 5:30 PM GMT
సినిమా థియేటర్లన్నీ అప్పుడే తెరుస్తారట..!
X
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సినిమా థియేటర్లను అన్నింటిని ఒకేసారి తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్ర మంత్రి జి కిషన్ రెడ్డి తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలకు తెలిపారు. కిషన్ రెడ్డి తాజాగా ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టాలీవుడ్ నిర్మాతలతో సంభాషించారు. లాక్డౌన్ లో టాలీవుడ్ ను ప్రభావితం చేస్తున్న సమస్యలపై చర్చించారు.

ఫిల్మ్ మేకింగ్ లోని మొత్తం 24 రంగాల్లోని కార్మికులను ఆదుకునేందుకు.. రోజువారీ కూలీలకు అనుమతి ఇవ్వడానికి.. ఫిల్మ్ షూట్లను అనుమతించడంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. సినీ పరిశ్రమలో ప్రాంతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి ప్రాంతీయ జిఎస్‌టి గురించి చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వివిధ రాష్ట్రాల సిఎంలను ఒప్పించి, చిత్రనిర్మాతలు ఫిల్మ్ స్టూడియోలను నిర్మించటానికి.. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా చిత్రీకరించడానికి సహాయం చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

టాలీవుడ్ రోజువారీ వేతన కార్మికులకు ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ, పైరసీ అరికట్టడం వంటి ముఖ్య విషయాలపై మంత్రి చర్చించారు. కేంద్రం ఈ విషయంలో సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల ప్రతినిధులతో తగిన సమయంలో మరో కీలక సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు - జెమిని కిరణ్ - ప్రశాంత్ - రవి యెర్నేని - దాము - టిజి విశ్వప్రసాద్ - వివేక్ కుచిభోట్ల - శరత్ మరార్ - అభిషేక్ అగర్వాల్ - దర్శకుడు తేజలు కేంద్ర మంత్రితో ఫేస్ బుక్ లైవ్ లో సంభాషించారు. ఆగస్టు లో కేంద్రం దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లను ఓపెన్ చేసే చాన్స్ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

-