Begin typing your search above and press return to search.

జిందగిపైన హోప్స్ బాగానే ఉన్నాయట

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:30 PM GMT
జిందగిపైన హోప్స్ బాగానే ఉన్నాయట
X
నేను శైలజ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల. ప్రేమ కథలని హృదయానికి హత్తుకునేల తీసే ఈ దర్శకుడు మరొక మంచి లవ్ అండ్ ఫ్రెండ్షిప్ స్టోరితో రాబోతున్నాడు. రామ్ - లావణ్య త్రిపాఠి అలాగే అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఉన్నది ఒకటే జిందగి అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ కిషోర్ తిరుమల సినిమా గురించి కొన్ని పాయింట్స్ ను చెప్పాడు.

కిషోర్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. స్నేహం - ప్రేమ గురించి నేను అనుకున్న సింపుల్ పాయింట్ ను మంచి కథనంతో తెరకెక్కించాను. కథ రాసుకున్నప్పుడు రామ్ అయితేనే తగిన న్యాయం చేయగలడని ఏడాది క్రితం అతను హైపర్ సినిమా షూటింగ్ లో ఉన్నపుడు కథ చెప్పాను. వినగానే రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకే అన్నారు. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సినిమాకి రామ్ యాక్టింగ్ ప్రధాన బలం. అనుపమ కూడా ఈ సినిమాకు మరో బలం అని చెప్పాలి ఆమె నటన కూడా ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది. ముఖ్యంగా ఆమెకు రామ్ కి మధ్య జరిగే సంభాషణలు చాలా బావుంటాయి.

ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నందుకు కొంచెం టెన్షన్ గా ఉందంటూ..నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. నా ప్రతి సినిమాను నా మొదటి సినిమాలనే ఫీల్ అవుతానని కిషోర్ చెప్పాడు. ఇకపోతే జిందగీ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయంటూ చెప్పాడు. అంతే కాకుండా ఇంకా తను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెబుతూ.. వెంకటేష్ గారితో ఒక స్క్రిప్ట్ పెండింగ్ లో ఉందని అలాగే నానితో కూడా కథా చర్చలు సాగుతున్నాయని తెలిపాడు.