Begin typing your search above and press return to search.

రామ్ సినిమా.. రియల్ స్టోరీ

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:30 PM GMT
రామ్ సినిమా.. రియల్ స్టోరీ
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ మూణ్నాలుగేళ్లుగా ఏమంత బాగా లేదు. ‘కందిరీగ’ తర్వాత అతడి సినిమాలేవీ సరిగా ఆడలేదు. సినిమాలు ఫ్లాపవడం కంటే కూడా పరమ రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న విమర్శలు అతడికి బాగా చెడ్డ పేరు కూడా తెచ్చాయి. ఈ నేపథ్యంలో ‘నేను శైలజ’ మీద ఎన్నో ఆశలతో ఉన్నాడు రామ్. రొటీన్ సినిమాలు చేస్తున్నానన్న విమర్శలు చెరిపేయడమే కాక.. తన కెరీర్ కు అత్యావశ్యకమైన విజయాన్ని కూడా అందిస్తుందని ఈ సినిమా మీద ఎన్నో అంచనాలతో ఉన్నాడు రామ్. టీజర్ - ట్రైలర్ చూస్తే రామ్ ఆశలు నెరవేరేలాగే అనిపిస్తున్నాయి.

స్రవంతి మూవీస్ సంస్థలో రచయితగా పని చేసి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న కిషోర్ తిరుమల కూడా ఔట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదొక నిజ జీవిత కథ అని.. సినిమా విడుదలయ్యాక ఈ కథ ఎవరిదన్నది వెల్లడిస్తానని కిషోర్ చెప్పాడు. రామ్ కు ఈ సినిమా ఎంత కీలకమో అర్థం చేసుకుని చాలా టైం తీసుకుని ఈ సినిమా స్క్రిప్టు రాశానన్నాడు. ‘‘నేను శైలజ స్క్రిప్టు రాయడానికి ఏడాది పైనే టైం పట్టింది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా.. కొత్తగా ఉండేలా స్క్రిప్టు తీర్చిదిద్దాను. స్రవంతి మూవీస్ బేనర్లో వచ్చిన నువ్వే నువ్వే తరహా ఫీల్ ఈ సినిమాలో ఉంటుంది. నా కథకు స్ఫూర్తి ఎవరన్నది సినిమా విడుదలయ్యాక చెబుతాను’’ అని కిషోర్ చెప్పాడు.