Begin typing your search above and press return to search.
కిషోర్ తిరుమల.. నీ పోరాటానికి హ్యాట్సాఫ్
By: Tupaki Desk | 2 Jan 2016 3:30 PM GMTకిషోర్ తిరుమల.. నిన్నట్నుంచి తెలుగు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు. ‘నేను శైలజ’తో మాంచి విజయాన్నందుకున్నాడీ యువ దర్శకుడు. సినిమా హిట్టవడమే కాదు.. ఇది డైరెక్టర్స్ మూవీ అన్న పేరు తెచ్చిపెట్టింది.. ఇంతకంటే ఓ దర్శకుడికి కావాల్సింది ఏముంది? ఐతే చాలామంది కిషోర్ కు ఇది తొలి సినిమా అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. కిషోర్ ఇప్పటికే రెండు సినిమాలు తీశాడు. ఒకటి తమిళంలో, ఇంకోటి తెలుగులో. ఆ రెండు కూడా పెద్ద ఫ్లాపులే.
తమిళంలో నాలుగేళ్ల కిందటే ‘పిల్లయార్ తెరు కడైసి వీడు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కిషోర్. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కిషోర్ కు తెలుగుతో పాటు తమిళం కూడా వచ్చు. మంచు మనోజ్ సినిమా ‘నేను మీకు తెలుసా’ తమిళ వెర్షన్ కు పని చేస్తూ ఆర్బీ చౌదరికి ఓ కథ వినిపించి మెప్పించిన కిషోర్... ఆయన రెండో కొడుకు రమేష్ తో వాళ్ల సొంత బేనర్లో ‘పిల్లయార్..’ సినిమా తీశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది.
తర్వాత టాలీవుడ్ కు వచ్చి.. రచయిత బి.వి.ఎస్.రవికి ఓ కథ చెప్పి అతడి నిర్మాణంలో ‘సెకండ్ హ్యాండ్’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. అసలీ పేరుతో సినిమా వచ్చినట్లు కూడా జనాలకు పెద్దగా తెలియలేదు. ఇలా రెండు ఇండస్ట్రీల్లోనూ విఫలమైన దర్శకుడికి ఇంకో అవకాశం దక్కడం మామూలు విషయం కాదు. కానీ అతను నైరాశ్యంలో కూరుకుపోకుండా పోరాటం కొనసాగించాడు. ఆ పోరాటం ఫలించి స్రవంతి రవికిషోర్, రామ్ అతడికి అవకాశమిచ్చారు. స్రవంతి మూవీస్ బేనర్లో డబ్బింగ్ మూవీ ‘రఘువరన్ బీటెక్’తో పాటు ‘శివమ్’ సినిమాకు డైలాగులు కూడా రాసిన కిషోర్.. ‘నేను శైలజ’తో దర్శకుడిగా మారాడు. తనేంటో రుజువు చేసుకుని మంచి విజయాన్నందుకున్నాడు. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ సాధించవచ్చని రుజువు చేసిన కిషోర్ కు.. అతడి ట్రాక్ రికార్డును కాకుండా టాలెంటును నమ్మి అవకాశం ఇచ్చిన రవికిషోర్, రామ్ లకు అభినందనలు చెప్పాలి.