Begin typing your search above and press return to search.

ఆ రెండూ వదలవా తిరుమలా?

By:  Tupaki Desk   |   19 Jun 2018 6:09 AM GMT
ఆ రెండూ వదలవా తిరుమలా?
X
మొదటి సినిమా నేను శైలజలో సున్నితమైన ప్రేమను ప్రేమికుడు తండ్రి అనే రెండు కోణాల్లో ఆవిష్కరించిన తీరుకు దర్శకుడు కిషోర్ తిరుమలకు ప్రశంశలతో పాటు వసూళ్లు కూడా దక్కాయి. హీరో రామ్ కు అదే కెరీర్ బెస్ట్ గా నిలిస్తే ఇప్పుడు మహానటిగా నీరాజనం అందుకుంటున్న కీర్తి సురేష్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. మ్యూజికల్ గా కూడా దేవి శ్రీ ప్రసాద్ వర్క్ దాన్ని ఒక మెట్టు పైనే నిలపగా స్నేహాన్ని కూడా అంతర్లీనంగా టచ్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ ఫ్రెండ్ గా ఏజ్ బార్ ఆర్టిస్ట్ ప్రదీప్ రావత్ తో చేయించిన పెర్ఫార్మన్స్ సూపర్ గా కనెక్ట్ అయ్యింది.

ఇక రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీలో ఇదే బాలన్స్ ను మానేజ్ చేయలేక తిరుమల కిషోర్ చేసిన పొరపాట్ల వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. మొదటి సినిమా హీరో రామ్ నే తీసుకున్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లు దేవి మ్యూజిక్ ఇవేవి కాపాడలేకపోయాయి. యూత్ ని టార్గెట్ చేసి లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ మీద ఏవేవో సీన్లు అల్లేసి ఆడుతుంది అని అంచనా వేసిన తిరుమల లెక్క పూర్తిగా తప్పింది. అయినా కూడా మళ్ళి వాటినే తన మూడో సినిమాకు కూడా వాడబోతున్నట్టు తాజా సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందించబోయే మూవీకి తిరుమల కిశోర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సారి కూడా ప్రేమ కథనే ఎంచుకున్న కిషోర్ అందులో కూడా ఫ్రెండ్ షిప్ కాన్సెప్ట్ ని లింక్ చేసాడట. తేజు ఇప్పటికే తేజ్ ఐ లవ్ యుతో అలాంటి కథనే ట్రై చేస్తున్నాడు. అది సక్సెస్ అయితే ఓకే. కిషోర్ కు ప్లస్ అవుతుంది. కానీ తను నమ్మిన ఒక ఫార్ములాను పదే పదే వాడుతున్న కిషోర్ తిరుమల అది దాటి కొత్తగా ఆలోచించలేడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో అలా ఒకటి రాసుకుని వెంకటేష్ కు ఆడాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ తో వినిపిస్తే షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయింది.

బహుశా ఆ సెంటిమెంట్ తోనే తనకు అచ్చి వస్తోందని భావిస్తున్న లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ ఫార్ములా వైపే మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినా ఒక పక్క ట్రెండ్ సెట్ చేసే పనిలో యువతరం దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో విభిన్నమైన ప్రయత్నాలు చేస్తుంటే ఆదే బ్యాచ్ లో ఉన్న తాను మాత్రం ఇంకా లవ్ ఫ్రెండ్ షిప్ అంటూ ఒకే జానర్ కు కట్టుబడిపోవడం పట్ల కిశోరె తిరుమల ఆలోచించుకుంటే ఇంకా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. చూస్తుంటే ఉన్నది ఒకటే జిందగీ పెద్దగా పాఠాలు నేర్పించినట్టు లేదు.