Begin typing your search above and press return to search.

కిస్‌.. కిసుక్కు

By:  Tupaki Desk   |   15 Nov 2018 2:06 AM GMT
కిస్‌.. కిసుక్కు
X
అర్జున్‌ రెడ్డి సినిమాలో ఇంగ్లిష్‌ కిస్‌.. కుర్రకారు గుండెల్లో కిస్‌ క్కుమంటూ గుచ్చుకుంది. ఆర్‌ ఎక్స్‌ 100 అంటూ దూసుకొచ్చిన పంజాబీ భామ హద్దు దాటిన ముద్దులతో హంగామా సృష్టించింది. ప్రియుడి అంతరంగంలో దోబూచులాడుతున్న ప్రేమ అలజడి ప్రియురాలి చెక్కిళ్లపై ముద్దుల ముద్ర పడుతుంది... నేను రక్షణంటూ చెల్లి చేతిపై అన్న ముద్దు రక్షణ కవచమై నిలుస్తుంది.  అమ్మ ప్రేమ ముద్దు బిడ్డకు అమృతమవుతుంది. నుదుటిపై నాన్న ఆప్యాయతల ముద్దు బంగారంలాంటి కూతుర్ని దీర్ఘాయుష్మాన్‌ భవ అంటూ ఆశీర్వదిస్తుంది.. ఇలా ముద్దులోని మురిపాలు - అనురాగాలు ఎన్నో ఎన్నోన్నో.. ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం టావీవుడ్‌ అంతా హద్దులు దాటిన ముద్దుల గురించే చర్చిస్తోంది.

తాజాగా స్టార్‌ కెమెరామెన్‌ ఛోటా కే నాయుడు గ్లామరస్‌ హీరోయిన్‌ కాజల్‌ ను బహిరంగ సభలో ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. అబ్బెబ్బే ఈ ముద్దులో ఎలాంటి పరమార్థాలు లేవని - ఎన్నో సినిమాలు చేసిన చనువుతో - స్వంతింటి మనిషనే మమకారంతో మాత్రమే ముద్దులొలికానని కెమెరామెన్‌ చెబుతున్నా  జనాలు మాత్రం ఒకటే చెవులు కొరుక్కుంటున్నారు. గతంలోనూ శిల్పాశెట్టికి కూడా హాలీవుడ్‌ హీరోతో ఇదే అనుభవం ఎదురైంది. ఆ సమయంలో ఇటు హాలీవుడ్, అటు టాలీవుడ్‌లో ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ బుగ్గలు నొక్కుకున్నారు. ఈ ముద్దుల పొద్దు పొడుపుల వివాదాలు ఏ హద్దుల్లో అస్తమిస్తాయో ? ఎవరికీ అర్థం కావడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.