Begin typing your search above and press return to search.

'కిస్' ఆ న‌టుడ్ని ఎంత దెబ్బేసిందంటే!

By:  Tupaki Desk   |   16 Sep 2018 7:19 AM GMT
కిస్ ఆ న‌టుడ్ని ఎంత దెబ్బేసిందంటే!
X
టాలీవుడ్‌లో తాజా సంచ‌ల‌నం అడ‌వి శేషు. ప్ర‌స్తుతం హీరోగా అవ‌కాశాలు వ‌స్తున్న ఆయ‌న ప్రస్థానం ర‌చ‌యిత‌గా మొద‌లై.. ద‌ర్శ‌కుడిగా సాగింది. త‌న రీల్ క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌టానికి గేర్ మార్చి మాస్ పంథాలో సాగే ప్ర‌య‌త్నంలో భారీగా దెబ్బ తిన్నాడు.

పోయిన చోట వెతుక్కోవాల‌నుకునే అడ‌వి శేషు.. రెండో ప్ర‌య‌త్నంలో ప్ర‌తినాయ‌కుడై.. త‌ర్వాత నాయ‌కుడైన అత‌గాడు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నారు. ఈ రోజు అడ‌వి శేషు సినిమా అంటే.. సమ్ థింగ్ స్పెష‌ల్ అన్న‌ట్లుగా మారింది. నాగ్ లాంటి సీనియ‌ర్ న‌టుడు శేషుకు కితాబునిస్తూ.. గూఢాచారి సినిమా చూశాక తామెంత బ‌ద్ధ‌క‌స్తుల‌మన్న విష‌యం అర్థ‌మైంద‌ని చెప్ప‌టం చూస్తే.. అంత‌కు మించిన గొప్ప కాంప్లిమెంట్ మ‌రొక‌టి ఉండ‌దేమో.

సినిమానే లోకంగా ఫీల‌య్యే శేషు జీవితంలో సినిమాటిక్ నే ఉంటుంది. క‌ష్టాల‌న్న‌వి తెలీకుండా పెరిగి.. గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని తిరిగిన శేషు.. ఒక‌ద‌శ‌లో ఇంటి అద్దె క‌ట్ట‌లేని ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడ‌న్న విష‌యం చాలా త‌క్కువ మందికి తెలిసిందే.

స‌క్సెస్ తో ఉన్న వేళ‌.. అంద‌రికి తోపుగా క‌నిపించే శేషు జీవితంలో అప్ అండ్ డౌన్స్ కు కొద‌వ‌లేదు. కాకుంటే.. మొద‌లెట్టిన ప‌నిని ఏదోలా పూర్తి చేసే మొండిత‌నం ట‌న్నులు ట‌న్నులు ఉంటుంది. అదే శేషుకు స‌రికొత్త ఇమేజ్ ను వ‌చ్చేలా చేసింద‌ని చెప్పాలి. టాలీవుడ్‌లో స‌రికొత్త క్రేజ్ ను సొంతం చేసుకున్న శేషు.. తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

త‌న జీవితంలో భారీ ఎదురుదెబ్బ గురించి చెప్పుకొచ్చారు. సినిమాటిక్ గా ఉండే ఈ ఉదంతం ఆడ‌వి శేషు మాట‌ల్లోనే చ‌దివితే.. "నాకేమీ కష్టాలు తెలీకుండానే తల్లిదండ్రులు, స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని ‘కర్మ’ చిత్రం చేశా. చాలా కొత్త ఆలోచనలతో తీసినా ఆడలేదే అనుకున్నా. ఆ సమయంలో ‘పంజా‘ చిత్రం వచ్చింది. ‘పంజా‘ తర్వాత నువ్వు కమర్షియల్‌ హీరో కావాలని కొంతమంది నన్ను తప్పుతోవ పట్టించారు"

‘కిస్‌‘ సినిమా చేయడానికి అప్పు చేశా. సరిగ్గా ఉదయం ఆట పడ్డాక పోస్టర్‌ అంటించిన మైదా పిండి ఖర్చు రాదనిపించింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలనే భయమేసింది. ఒకపక్క నుంచి అప్పులోళ్ల ఫోన్లు. మొదటిసారి సినిమా ఏంటో, జీవితమేంటో అర్థమైంది. పదహారేళ్ల వయసులో అమెరికాలో మెర్సిడెస్‌ కార్‌ ను నడిపినవాణ్ణి. ‘కిస్‌’ సినిమా తర్వాత ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. ఇంట్లో చెప్పుకోలేక పోయా. మా అన్నయ్య సాయం చేయలేని పరిస్థితి. ఒంటరిగా ఫీలయ్యాను. ఆ సమయంలోనే ‘బాహుబలి‘ చిత్రం చేయమని నిర్మాత శోభు ఫోన్‌ చేశారు. బాహుబలి ఫస్ట్‌ డే ‘నేనెందుకైనా పనికొస్తానా.. నాలో అంత ప్రతిభ ఉందా’ అని ఆలోచించి అక్కడ అడుగెట్టా. వాళ్ల ప్రోత్సాహం చూసి ధైర్యం వచ్చింది. ఏదేమైనా ‘కిస్‌’ రిలీజ్‌ అయిన రోజు నా జీవితంలో అత్యంత బాధపడిన రోజు. ఆ ఒంటరితనంలో నా తల్లిదండ్రులే నాకు భరోసానిచ్చారు" అని చెప్పారు.