Begin typing your search above and press return to search.
'కేజీయఫ్ 2' Vs 'బీస్ట్'.. తెలుగులో దేనికి బజ్ ఉంది..?
By: Tupaki Desk | 2 April 2022 12:30 AM GMTమరో రెండు వారాల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. రెండు పెద్ద సినిమాలు నువ్వా నేనా అంటూ ఢీకొట్టుకోబోతున్నాయి. 'కేజీఎఫ్: చాప్టర్ 2' మరియు 'బీస్ట్' వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కేజీయఫ్ 2' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ఇక తమిళ్ హీరో విజయ్ - పూజా హెగ్డే జంటగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన 'బీస్ట్' సినిమాని ఏప్రిల్ 13న రిలీజ్ చేయనున్నారు.
రెండు సినిమాలు కూడా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. దీంతో 'కేజీఎఫ్: చాప్టర్ 2' - 'బీస్ట్' మధ్య గట్టి పోటీ ఉంటుందని సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
అయితే హీరో యష్ మాత్రం ఒక సినిమాలు మరో చిత్రంతో పోటీ ఉండటానికి ఇవేవీ ఎన్నికలు కావని.. ఇది 'కేజీయఫ్ 2' vs 'బీస్ట్' కాదని.. 'కేజీయఫ్ 2' అండ్ 'బీస్ట్' అని పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి యశ్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు.
కానీ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే పోటీ అనివార్యమనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిల్లో 'బీస్ట్' కంటే 'కేజీఎఫ్: చాప్టర్ 2' చిత్రానికే కాస్త బజ్ ఎక్కువ ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'కేజీయఫ్ 2' సినిమా రిలీజ్ డేట్ ని 8 నెలల ముందుగానే లాక్ చేసి దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఇటీవల వచ్చిన 'తుఫాన్' సాంగ్ మరియు ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ శరవేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు 'బీస్ట్' సినిమా విడుదల తేదీని ఈ మధ్య ఖరారు చేసారు. ఇటీవల వచ్చిన 'అరబిక్ కుత్తు' 'జాలీఓ' పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సాంగ్స్ తప్ప ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. దీనికి కారణం ఇంతవరకు టీజర్ - ట్రైలర్ వంటివి రాకపోవడమే.
ఇక తెలుగులో 'బీస్ట్' కంటే 'కేజీఎఫ్ 2' ఎక్కువ అడ్వాంటేజ్ మరియు బజ్ కలిగి ఉందని చెప్పొచ్చు. రేపు విజయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇది ఆకట్టుకుంటే బజ్ ఆటోమేటిక్ గా వస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇకపోతే 'కేజీఎఫ్ 2' సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు సమస్య కావచ్చు. 'కేజీయఫ్' ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర సంస్థ రిలీజ్ చేస్తోంది.
'బీస్ట్' - 'కేజీఎఫ్ 2' సినిమాలు రెండూ అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. మరి విజయ్ Vs యష్.. 'బీస్ట్' Vs 'కేజీఎఫ్ 2' అనే విధంగా మారుతున్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు స్ట్రాంగ్ గా నిలబడతారో చూడాలి.