Begin typing your search above and press return to search.
నాగార్జున గీతాంజలి లాంటి చిత్రంలో సుశాంత్
By: Tupaki Desk | 17 Jun 2020 5:10 AM GMTచిచోర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాక సుశాంత్ నటించిన `డ్రైవ్` నెట్‌ఫ్లిక్స్ లో రిలీజై అభిమానుల్ని ఆకట్టుకుంది. తదుపరి `దిల్ బెచారా` విడుదలకు సిద్ధంగా ఉంది. మే 8 న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం 2014 బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రం `ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్`కి రీమేక్. ఈ సినిమా కథాంశం ఎంతో ఉద్వేగాన్ని రేకెత్తించే అంశాలతో రక్తి కట్టిస్తుంది. 2014 లో హాలీవుడ్ లో రిలీజై ఇది ప్రతి ఒక్కరినీ కన్నీటిపర్యంతమయ్యేలా ఉద్వేగానికి లోను చేసింది.
ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. నాయకానాయికలు (ప్రేమికులు) ఇద్దరూ క్యాన్సర్ బారిన పడి ఎలాంటి జీవితాన్ని చవిచూశారన్నదే కథాంశం. ఒక రకంగా హాలీవుడ్ చిత్రం చూసిన వారికి నాగార్జున గీతాంజలి తరహాలో ప్రేమకథ లో డెప్త్ గుండెను పిండేస్తుంది. సుశాంత్ మరణానంతరం రీమేక్ గా వస్తున్న `దిల్ బెచారా` మరింతగా అభిమానులతో కన్నీళ్లు పెట్టిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయిక సంజన సంఘితో రొమాంటిక్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు రక్తి కట్టించనున్నాయిట. థియేటర్లలో కన్నీళ్లు పెట్టని వాళ్లు ఉండరని చెబుతున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ విషాద ప్రేమకథకు ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం మరో అస్సెట్ కానుంది. ఈ చిత్రం ఇప్పుడు నేరుగా OTT వేదికపై విడుదల కానుంది. మేకర్ ముఖేష్ చబ్రాకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని చెబుతున్నారు. సుశాంత్ అభిమానులకు ఒక అందమైన జ్ఞాపకంగా ఈ మూవీ నిలిచిపోనుందని అంచనా.