Begin typing your search above and press return to search.
రంగం-2.. రోహిత్ సినిమాకు రీమేకా?
By: Tupaki Desk | 13 Oct 2015 3:30 PM GMTనాలుగేళ్ల కిందట తమిళంలో ‘కో’ పేరుతో.. తెలుగులో ‘రంగం’గా విడుదలై అద్భుత విజయం సాధించింది కేవీ ఆనంద్-జీవా కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు తమిళంలో కో-2 పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఐతే ఫస్ట్ పార్ట్ కు పని చేసిన వాళ్లవెరూ ఇందులో లేరు. బాబీ సింహా ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా.. శరత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి’ సినిమాకు రీమేక్ అంటున్నారు. స్టోరీ లైన్ విషయంలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తోంది. ‘కో’ సినిమాకు సీక్వెల్ అనిపించేలా ‘ప్రతినిధి’లో పాత్రల్ని కొంచెం మార్చి.. ‘కో-2’ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ఇందులో హీరో ఓ టీవీ ఛానెల్ కెమెరామన్. అతను సీఎంగా ఉన్న ప్రకాష్ రాజ్ ను కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాప్ ద్వారా ఓ సమస్యను పరిష్కరిస్తాడు. ఇదీ కో-2 మూల కథ. ప్రతినిధి కథ కూడా ఇలాగే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఐతే అందులో హీరో టీవీ ఛానెల్ కెమెరామన్ కాదు. అంతే తేడా. ఐతే ఇది అఫీషియల్ రీమేకా కాదా అన్నది తెలియడం లేదు. సినిమా విడుదలయ్యాకే ఏమేం పోలికలున్నాయన్నదాన్ని బట్టి.. టైటిల్ క్రెడిట్స్ ను బట్టి ఆ విషయం తేలుతుంది. గత ఏడాది విడుదలైన ‘ప్రతినిధి’ రోహిత్ కెరీర్ లో ఓ మంచి సినిమా అనిపించుకుంది. అతడికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా పెట్టుబడి మీద దాదాపు మూడు రెట్లు రాబట్టడం విశేషం.