Begin typing your search above and press return to search.

50 ఏళ్ల రికార్డ్ తిరగరాస్తున్న ఫ్లాప్‌ మూవీ

By:  Tupaki Desk   |   20 Jan 2016 4:40 AM GMT
50 ఏళ్ల రికార్డ్ తిరగరాస్తున్న ఫ్లాప్‌ మూవీ
X
డబ్బింగ్ సినిమాలపై కన్నడలో సంపూర్ణ నిషేధం అమలవుతోంది. ఈ నిషేధం ఇప్పటిది కాదు.. యాభై ఏళ్ల నుంచి కన్నడలో ఒక్క సినిమా కూడా డబ్బింగ్ కాలేదు. 1965లో రిలీజ్ అయిన తెలుగు మాయాబజార్ డబ్బింగ్ వెర్షనే.. ఇక్కడ ఆఖరి డబ్బింగ్ సినిమా. ఇంత కాలానికి ఆ రికార్డును ఓ సూపర్ స్టార్ మూవీ తిరగ రాయనుంది.

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను యానిమేషన్ రూపంలో చూపించిన కొచ్చాడయాన్ కు కన్నడిగుల కోసం డబ్బింగ్ చేశారు. తెలుగులో విక్రమసింహ పేరుతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. రజినీ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. తెలుగు - తమిళ్ - హిందీ - మరాఠి - భోజ్ పురి - బెంగాలి.. ఇలా అన్ని భాషల్లోనూ వచ్చింది కానీ, కన్నడలో మాత్రం విడుదల కాలేదు. ఇప్పుడీ మూవీకి కన్నడ వెర్షన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ఇప్పటికే కర్నాటకలో డబ్బింగ్ ఫిలిం ఛాంబర్ కూడా ఏర్పాటు కాగా.. ఇక ఇక్కడ కూడా డబ్బింగ్ మూవీల హల్ చల్ మొదలుకానుంది. దీనికి కొచ్చాడయన్ తోనే ఆరంభం. ఈ సినిమాని రెగ్యులర్ ఫార్మాట్ లోనే అంటే ఆడియో లాంఛ్ - ప్రోమో విడుదల - టీజర్ - ట్రైలర్ అంటూ.. హంగామా మధ్యలోనే విడుదల చేయనున్నారు. అయితే.. కన్నడలో డబ్బింగ్ సినిమాలను అనుమతించడంపై కొందరు ఇంకా వ్యతిరకేతను వ్యక్తం చేస్తున్నారు.