Begin typing your search above and press return to search.

కత్తిపై పవర్ ఫాన్స్ సాంగ్: వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   9 Jan 2018 8:04 AM GMT
కత్తిపై పవర్ ఫాన్స్ సాంగ్: వైరల్ వీడియో
X
అజ్ఞాతవాసి విడుదల దగ్గర పడే కొద్దీ కత్తి మహేష్ వివాదం కూడా అంతకంతకు రాజుకుంటూనే ఉంది. మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ తో పతాక స్థాయికి చేరిన ఈ ఇష్యూ ని రెండు వైపులా ఎవరో ఒకరు ఆరిపోకుండా వేడిని కాపాడుకుంటూ వస్తున్నారు. 15 దాకా ఆగండి అని కోన వెంకట్ - కత్తి మహేష్ పరస్పరం చెప్పుకున్న నేపధ్యంలో ఆ రోజు కోసం వెయిట్ చేస్తుండగా పవన్ ఫాన్స్ తయారు చేసిన ఒక వీడియో వైరల్ రూపంలో విపరీతంగా షేర్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అజ్ఞాతవాసిలో పవన్ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వర్ రావా పాటను పేరడి రూపంలో కత్తి మహేష్ పై మార్చి రాసి అతని తిడుతున్నట్టు, వార్నింగ్ ఇస్తున్నట్టు ఒక అభిమాని పాడి దానిని సోషల్ మీడియా లో పెట్టడం మరో కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇష్యూ లో పూనం కౌర్ - వేణు మాధవ్ - కోన వెంకట్ - హైపర్ ఆది లాంటి వాళ్ళకు కత్తి మహేష్ కు మాటకు మాట ఎక్స్ చేంజ్ మేళా జరిగిపోయింది. సరే కొద్ది రోజులు చల్లబడుతుందేమో - అందరి దృష్టి సినిమాపైకి వెళ్తుంది కదా అనుకునే లోపే ఈ పాట వచ్చి చేరడం పట్ల పవన్ ఫాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

సినిమాను ప్రమోట్ చేయాల్సిన టైంలో ఇప్పుడు కత్తి మహేష్ పాటను తెరమీదకు తీసుకువచ్చి, సినిమా టాక్ ని పక్క దారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని కొందరు అంటుండగా ఈ మాత్రం ఘాటుగా బదులు ఇవ్వకపోతే అతను ఇంకా రెచ్చిపోతాడు అని మరికొందరు అంటున్నారు. ఎవరి స్పందన ఎలాగున్నా ఇది ఇప్పట్లో ఆగేలా మాత్రం కనిపించడం లేదు. సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ అవుతున్న ఈ వీడియో ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.