Begin typing your search above and press return to search.
కొడకా కొడకా వచ్చేసింది-పవన్ సాంగ్
By: Tupaki Desk | 31 Dec 2017 12:37 PM GMTపవన్ కళ్యాణ్ ఫాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కొడకా కోటేశ్వర్ రావా పాట చెప్పిన టైం కి సరిగ్గా విడుదలైంది. మాటలు - పాట మిక్స్ చేసి గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ రాసిన గమ్మత్తైన లిరిక్స్ కి అనిరుద్ క్యాచీ ట్యూన్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.సినిమాలో ఏదో పాత్రను ఎగతాళి చేస్తూ టీజింగ్ మోడ్ లో ట్యూన్ చేసిన సాంగ్ ఫాన్స్ కైతే వెంటనే కిక్ ఇచ్చేలా ఉంది. కాటమరాయుడు అంత మేజిక్ ఉందా లేదా అంటే వెంటనే చెప్పలేం కాని అంచనాలకు తగ్గట్టే ఉంది అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అరిసైపోతావ్ - కర్సైపోతావ్ - మసైపోతావ్ లాంటి క్యాచీ వర్డ్స్ తో పాడుకోవడానికి ఈజీగానే ఉంది పాట. మధ్య మధ్యలో పవన్ తన చుట్టూ ఉన్న వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలు - సరదాలు అన్ని ఖుషిని గుర్తుకు తెస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మేజిక్ అనిరుద్ రిపీట్ చేయగలిగాడా అనే పోలిక రావడం సహజమే కాని ఇప్పుడే కంక్లూజన్ కి రావడం కరెక్ట్ కాదు.
ఈ పాటతో అజ్ఞాతవాసి ఆల్బంలోని మొత్తం పాటలు విడుదల అయిపోయాయి. ఇప్పటికే కావలసినంత ఉన్న హైప్ ని అమాంతం పెంచేలా లేకపోయినా విజువల్ గా స్క్రీన్ మీద పవన్ స్టెప్స్ చూస్తూ అల్లరి ఎంజాయ్ చేస్తూ మెల్లగా ఎక్కేలా ఉంది. 'శర్మ గారు నేనేం పాడుతున్నారు, మీరేం వినిపిస్తున్నారు' అని పవన్ అడగటం బ్రాహ్మీ స్టైల్ కామెడీ ని గుర్తు చేస్తే 'నా ఊపు అందుకునే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరా' అంటే అనిరుద్ ఎంట్రీ ఇవ్వడం, చిరిగిన అంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి పర్సైపోతావ్ రో అనడం పీక్స్ కి తీసుకెళ్ళింది. చుట్ట - చెత్త - పీక లాంటి చిన్న చిన్న పదాలతో కొడకా సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యే సూచనలు ఉన్నాయి. పద్మజ గారు మీరు మధ్యాన్నం భోజనం చేసినట్టు లేరు అని పవన్ అనడం ఎవరి గురించబ్బా అనే ప్రశ్న కూడా ఫాన్స్ ని ఆలోచనలో పడేసింది. మొత్తానికి న్యూ ఇయర్ ఎండింగ్ కి కావలసినంత సరుకు పాట రూపంలో ఇచ్చేసాడు పవన్.