Begin typing your search above and press return to search.
పాత దర్శకులు మెగాస్టార్ పై పడ్డారేంటో
By: Tupaki Desk | 12 July 2016 5:57 AM GMT'రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ ఏకైక హీరో ఆయన' అంటూ మెగాస్టార్ చిరంజీవికి గురించి ఓ అవార్డ్ ఫంక్షన్ లో దగ్గుబాటి రాణా ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇది. 1980లు - 90లలో చిరంజీవిని మ్యాచ్ చేయడం.. ఆయన స్టామినాని చేయడం ఎవరి వల్లా కాలేదు. అలా మెగాస్టార్ ఆ రేంజ్ కి చేరుకోవడంలో.. ఎంతో మంది దర్శకుల ట్యాలెంట్ కూడా ఉంటుంది. అయితే.. వాటికి ఆసరా చిరంజీవి ప్రతిభ అనడంలో అతిశయం ఉండదు. ఆ దర్శకులు వేరే హీరోలతో వరుసగా సినిమాలు చేసినా ఆ స్థాయి హిట్స్ కొట్టలేకపోయారు.
ఆ తరం దర్శకుల్లో కొందరు ఇప్పుడు చిరంజీవి 150వ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. మొదట కె.విశ్వనాథ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇప్పుడున్న స్థాయికి డ్యాన్సులు ఫైట్లు చేయడం కంటే సమాజానికి మెసేజ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన్ని ఆ సినిమాపై ప్రశ్నించనపుడు ఈ సమాధానం వచ్చింది. ఇక రీసెంట్ గా చిరంజీవి 150వ చిత్రంపై.. ఆయనతో అనేక సూపర్ హిట్స్ కొట్టిన కోదండరామిరెడ్డి కూడా మాట్లాడారు. అదేంటంటే.. చిరు 150 సినిమాలో మెసేజ్ లు ఇస్తే జనాలు నవ్వుకుంటారని.. అందుకని కామెడీ సినిమా చేస్తారని అనుకుంటున్నట్లు కోదండరామిరెడ్డి చెప్పాడు.
చిరు 150పై ఇద్దరు సీనియర్ దర్శకులు విభిన్న అభిప్రాయాలు చెప్పడం విశేషం. అయితే.. ఈ తరం ప్రేక్షకులకు ఏం కావాలో తెలియక ఫేడవుట్ అయిపోయిన కోదండరామిరెడ్డి.. తన కొడుకు వైభవ్ ని హీరోగా నిలబెట్టడంలో డీలా పడ్డారు. తన కొడుక్కే ఎలాంటి సినిమాలో తీయలేకపోతున్న ఈయన.. చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండాలో చెప్పడం మరీ వింతగా అనిపించడం లేదూ అంటున్నారు మెగా ఫ్యాన్స్.