Begin typing your search above and press return to search.
రెడ్డి గారు బాగా అప్సెట్ అయ్యారట!!
By: Tupaki Desk | 21 July 2016 6:07 AM GMTమెగాస్టార్ చిరంజీవిపైనా.. 150వ సినిమాపైనా కామెంట్స్ చేసి వార్తల్తోకి ఎక్కారు సీనియర్ డైరెక్టర్ ఎ.కోదండ రామిరెడ్డి. చిరు ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే జనాలు నవ్వుకుంటారని కామెంట్ చేసిన ఈయన.. రెండు రోజుల్లోనే తన మాట వెనక్కి తీసుకున్నారు.
తను అంత హార్ష్ గా మాట్లాడనన్న విషయం తెల్లారి టీవీల్లోనూ వెబ్ సైట్లలోనూ చూశాకే అర్ధమైందన్న కోదండ రామిరెడ్డి.. చిరు ఎలాంటి సినిమాలో చెప్పడానికి తానెవరు అంటూ వేదాంతం కూడా చెప్పేశారు. తాను కూడా ఫ్లాప్ సినిమాలు తీసిన సంగతి గుర్తు పెట్టుకున్నారు. అందుకే చిరంజీవికి సారీ కూడా చెప్పారు. ఇప్పుడాయన ఫీల్ కావడానికి కారణం ఏంటంటే.. చిరంజీవిపై నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు ప్రతీ మీడియా హౌస్ అదే లీడ్ పాయింట్ చేసి స్టోరీలు స్టోరీలుగా ప్రసారాలు చేయగా.. తాను సారీ చెప్పినపుడు చిన్న కాలమ్ వార్త ప్రచురించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. నెగిటివ్ గా మాట్లాడినపుడు అంతగా ప్రచారం చేసేసి.. తాను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరినపుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదే అని ఫీలవుతున్నారట కోదండరామిరెడ్డి.
ఈ సీనియర్ డైరెక్టర్ ఫీలింగ్ చూస్తుంటే.. రీసెంట్ గా రైటర్ చిన్నికృష్ణ మాటలు గుర్తుకు రావడం సహజం. 'చిన్నికృష్ణ 2వందల మందికి అన్నదానం చేశాడంటే ఛానల్స్ పట్టించుకోవు కానీ.. చిన్నికృష్ణ రేప్ అటెంప్ట్ చేశాడంటే మాత్రం హాట్ న్యూస్ అవుతుంది' అన్నాడు ఆ రైటర్. ఇప్పుడా మాటలను మన మీడియాలు.. నిజం చేసేశాయి కదూ.