Begin typing your search above and press return to search.
'ఆ' కోరిక తీరకుండానే ఇలా అయిపోయిందా!
By: Tupaki Desk | 23 Feb 2019 9:42 AM GMTఅలనాటి టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన కోడి రామకృష్ణ అనారోగ్యం కారణంగా నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన ప్రస్థానాన్ని ఆలోచిస్తూ ఉన్న క్రమంలో ఆయన చిరకాల కోరిక - చివరి కోరిక ఒకటి తెలుస్తుంది. ఇంతకీ ఏంటి ఆ కోరిక అని వివరాల్లోకి వెళితే - కోడి రామ కృష్ణ దర్శకుడిగా ఎన్నో..ఎన్నెన్నో వండర్స్ ను క్రియేట్ చేశారు...తెలుగు తెరపై అద్భుతాలు సృష్టించడంలో ఎప్పటికపుడు అప్ డేటెడ్ గా ఉండేవారు..ఈ క్రమంలోనే ఆయన అనేక ఆలోచనలతో సినిమాలు తెరకెక్కించాలి అని ఎప్పుడూ అనుకునే వారు..
వాటిల్లో ముఖ్యంగా ప్రపంచ బంధ్....స్వర్గంలో పాలిటిక్స్ - అంకుల్ ఆంజనేయ స్వామి...ఇలా రకరకాల సినిమాలను తనదైన స్టైల్ లో తెరకెక్కించాలి అని ఎన్నో..ఎన్నెన్నో ఆలోచనలను తనలోనే దాచుకున్నట్లు తెలుస్తుంది. చివరి రోజుల్లో ఇండస్ట్రీలో కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలు ఎప్పుడూ సినిమా వైపే తిరుగుతూ ఉండేవి అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే వీటితో పాటు ఆయన ఎప్పుడు గ్రామీణ నేపధ్యం ఉన్న సినిమాలను లోకల్ ఆర్టిస్ట్స్ తో - అతి తక్కువ ఖర్చుతో తియ్యాలి అని అనుకునే వారని - ఆ ప్రయత్నం ఆయన దర్శకత్వంలో కాకపోయినా యువ దర్శకుడు 'వెంకటేష్ మహా' దర్శకత్వంలో 'కంచరపాలెం' రూపంలో తెరకెక్కింది. దీన్ని బట్టే చెప్పవచ్చు కోడి రామకృష్ణ ఆలోచన ఎంత ముందు చూపు కలిగిందో అని.
ఇక చివరాకరికి ఆయన చివరి కోరిక - లైఫ్ టైమ్ గోల్ విషయం తీసుకుంటే, ఆయన డ్రీం ప్రాజెక్ట్ ఒకటి ఎప్పటి నుంచో అనుకుంటున్నారట..ఆ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే - పూర్తి గ్ర్యాఫిక్స్ తో కూడిన 'కోడి'...'కోళ్ల పందాలు'...దాన్ని పిల్లలు..రివెంజ్ ఇలాంటి కధ ఒకటి తెరకెక్కించాలి అని ఆయన ఆశపడేవారట. ముఖ్యంగా కోడి పందాల సమయంలో ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకునే కోడి యొక్క కుటుంభం మనుషులు మీద పగబట్టడం లాంటి కధ ఇది అని తెలుస్తుంది. అయితే దీనికి సంభందించి స్టోరీ బోర్డ్ కూడా సిద్దం చేసుకున్నారు అని, కానీ ఆ కోరిక తీరే లోపే అందరినీ వదిలి తిరిగి రాని తీరాలకు వెళ్ళిపోయారు ఆయన. మొత్తంగా అదీ ఆయన జీవితంలో చివరిగా మిగిలిపోయిన కోరిక..