Begin typing your search above and press return to search.

సెక్స్ గోల తప్ప ఈ షో లో ఇంకేం ఉండదా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 1:37 PM GMT
సెక్స్ గోల తప్ప ఈ షో లో ఇంకేం ఉండదా?
X
బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు హిందీ ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా చూసే టాక్ షో కాఫీ విత్ కరణ్‌ షో. ఈ షోలో పాల్గొనేందుకు బాలీవుడ్‌ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ కూడా పాల్గొనేందుకు ఆసక్తి గా ఉంటారు.

బాలీవుడ్‌ తో పాటు అన్ని చోట్ల కూడా మంచి ఆధరణ ఉండే ఈ షో లో చాలా వరకు లవ్ అఫైర్స్ గురించి.. ఇతర ఇల్లీగల్‌ అఫైర్స్ గురించి కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ ఉన్నాడు.

ముఖ్యంగా ఈ సీజన్ లో ప్రతి ఎపిసోడ్‌ లో కూడా సెక్స్ లైఫ్ గురించి కరణ్‌ జోహార్‌ వచ్చిన గెస్ట్‌ లను ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతుంది. ఆ ప్రశ్నలు ఉండటం వల్ల షో ఎక్కువ మందికి రీచ్‌ అవుతుందని భావిస్తున్నాడో లేకా మరేంటో కాని ప్రతి ఎపిసోడ్‌ లో కూడా ఏదో ఒక సందర్భంలో కరణ్‌ జోహార్‌ సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలను సెలబ్రెటీలను అడుగుతున్నాడు.

తాజాగా ఎంతో మంది గెస్ట్‌ లను సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నించడంతో పాటు.. తన సెక్స్ లైఫ్ గురించి కూడా కరణ్ జోహార్ మాట్లాడటంతో కొందరు విమర్శిస్తూ ఉన్నారు.

తాజాగా షాహిద్ కపూర్ మరియు కియారా అద్వానీ పాల్గొన్న సమయంలో కూడా కరణ్‌ జోహార్ అదే ప్రశ్నలను సంధించడంతో వారు కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించారు.

షాహిద్ కపూర్‌ తో పాటు కియారా అద్వానీ లు షో లో పాల్గొన్న సమయంలో కరణ్‌ జోహార్‌ సెక్స్‌ లైఫ్ ఎలా ఉంది.. ఎలాంటి సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా ప్రశ్నించాడు. దాంతో కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ షో లో సెక్స్ గోల తప్ప మరే విషయాలు లేవా చర్చించడానికి అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.