Begin typing your search above and press return to search.

టాక్‌ షో బూతుల మయం అవుతోంది

By:  Tupaki Desk   |   21 Nov 2018 4:33 AM GMT
టాక్‌ షో బూతుల మయం అవుతోంది
X
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఆధరణ దక్కించుకున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌ షో మంచి టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకుని ముందుకు దూసుకు వెళ్తుంది. మొదట్లో ఈ షోను చాలా చక్కగా, అహ్లదకరమైన వాతావరణంలో, మంచి టాపిక్స్‌ తో కరణ్‌ కొనసాగించాడు. కాని సీజన్‌ లు ముగుస్తున్నా కొద్ది, కొత్త సీజన్‌ లు ప్రారంభం అవుతున్నా కొద్ది ఈ టాక్‌ షో కాస్త బూతుల షో అవుతోంది. ఎంత సేపటికి ఈ టాక్‌ లో ఇల్లీగల్‌ అఫైర్స్‌ - సెక్స్‌ రిలేషన్స్‌ - పడక గది ముచ్చట్లు మాత్రమే కరణ్‌ చర్చిస్తున్నాడు.

ప్రస్తుత సీజన్‌ లో ఇది ఇంకాస్త ఎక్కువ అయ్యింది. వచ్చిన ప్రతి గెస్ట్‌ తో కూడా ఈ విషయాలనే మాట్లాడటం - వాటి గురించే ప్రశ్నలు వేయడం చేస్తున్నాడు. లవ్‌ - లీవింగ్‌ రిలేషన్‌ షిప్స్‌ ను బయట పెట్టడంతో పాటు కొన్ని రహస్యాలను కూడా కరణ్‌ వచ్చిన గెస్ట్‌ లతో చెప్పిస్తున్నాడు. తాజాగా సారా అలీ ఖాన్‌ మరియు సైఫ్‌ అలీ ఖాన్‌ లు హాజరు అయిన సమయంలో సైఫ్‌ అలీ ఖాన్‌ - కరీనా కపూర్‌ ల బెడ్‌ రూం రిలేషన్‌ గురించి చర్చించిన విషయం తెల్సిందే.

సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా బెడ్‌ రూం విషయాలను కరణ్‌ మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. ఇలా కరణ్‌ టాక్‌ షో కాస్త బూతుల షో అవుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మసాలా ఉంటేనే మంచి టీఆర్పీ రేటింగ్‌ వస్తుందని భావించిన కరణ్‌ ఈతరహా చర్చకు తెర లేపినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరణ్‌ ఇలాంటి చర్చ జరపడం వల్ల దర్శకుడిగా తనకు ఉన్న స్టార్‌ స్టేటస్‌ ను కోల్పోవాల్సి వస్తుందని - గౌరవంను తనకు తాను దిగజార్చుకున్న వాడు అవుతాడంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.