Begin typing your search above and press return to search.

కోహ్లీ ఫస్ట్ క్రష్ అనుష్క కాదట

By:  Tupaki Desk   |   26 May 2016 5:03 AM GMT
కోహ్లీ ఫస్ట్ క్రష్ అనుష్క కాదట
X
క్రికెట్ మైదానంలో తన విధ్వంసక బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించటమే కాదు.. బౌలింగ్ ఎందుకు వేస్తున్నామా? అని అనిపించేలా చెలరేగిపోయే విరాట్ కోహ్లీని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. తన వైఖరితో మైదానం వెలుపలా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమాయణం.. వారిద్దరి చెట్టాపట్టాలు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ కావటంపై వారి ఫ్యాన్స్ పండగే చేసుకున్నారు. చూడచక్కటి ఈ జంట ఒకటైతే ఎంతబాగుండని అనుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.

క్లోజ్ గా మూవ్ అయిన వీరిద్దరూ.. ఏమైందో కానీ కటీఫ్ చెప్పేసుకోవటం వారి అభిమానుల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. తమ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకునేందుకు ప్యాచప్ మొదలైందన్న వార్తలు ఈ మధ్యన వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కోహ్లీ తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. కోహ్లీ అంటే పడి చచ్చే అమ్మాయిలు కోట్లాది మంది ఉన్నా.. కోహ్లీ మనసును తొలిసారి దోచుకున్నది మాత్రం అనుష్క శర్మ కాదని చెప్పుకొచ్చారు. తన లైఫ్ లో ఫస్ట్ క్రష్ నాటి హాట్ బ్యూటీ కరిష్మా కపూర్ అంటూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

బెబో అక్క అయిన కరిష్మా గతంలో ఎంత పాపులరో తెలిసిందే. అప్పట్లో ఆమెను యూత్ తెగ ఆరాధించేవారు. పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ఈ ఆంటీ.. కోహ్లీ మాటలతో ఖుషీ ఖుషీ కావటం ఖాయమనే చెప్పాలి. కోట్లాది మంది ఆరాధించే వ్యక్తికి తాను ఫస్ట్ క్రష్ అన్న విషయం ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు చెప్పండి?