Begin typing your search above and press return to search.

కోహ్లీ ‘గుండె’ అతుక్కుంది

By:  Tupaki Desk   |   3 Jun 2016 9:40 AM GMT
కోహ్లీ ‘గుండె’ అతుక్కుంది
X
సెలబ్రిటీల వ్యవహారం కాస్త డిఫరెంట్. వారు ఏం అనుకుంటే అది చెప్పగలరు. చెప్పకూడదంటే చెప్పరు. వ్యక్తిగత విషయాల్ని చెప్పమని ఫోర్స్ చేయలేం. అలా అని ఒక విషయం మీద తన బాధను షేర్ చేసుకొని.. కోట్లాది మంది చేత అయ్యో పాపం అని సానుభూతిని కొల్లగొట్టి.. ఇప్పుడు హ్యాపీగా ఉన్న ఇష్యూను అందరికి చెప్పకపోతే ఎలా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇంతకీ ఇదెవరి విషయంలో అంటారా? అక్కడికే వస్తున్నాం.

సెలబ్రిటీ జంటల్లో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించే విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ భామ అనుష్కశర్మ యవ్వారమే. ఈ ప్రేమపక్షలు ఆ మధ్య ఎంతలా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా వారే అన్నట్లుగా వ్యవహరించారు. అంతలో ఏమైందో కానీ ఇద్దరూ కటీఫ్ చెప్పేసుకొన్నారు. ఎవరి దారిన వారు ఉండిపోయారు. ఈ వేదనలో ‘గుండె పగిలింది’ అంటూ సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేసిన కోహ్లీ పోస్ట్ కు కోట్లాది మంది ఆయన్ను అభిమానించే వారు అయ్యో పాపం అనేసి బాధ పడ్డారు.

ఈ చూడచక్కటి జంట కలిస్తే ఎంత బాగుండు అనుకున్నోళ్లకి తక్కువేం కాదు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే కొన్ని ఘటనలు జరగటం.. వీరిద్దరూ కలిసినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ మాటలకు తగిన ఆధారాలు లభించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా సుల్తాన్ షూట్ కోసం బుడాపెస్ట్ వెళ్లాల్సిన అనుష్కను తానే స్వయంగా ఎయిర్ పోర్ట్ లో సెండాఫ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోహ్లీ.. అనుష్కలు ఇద్దరూ ఒకేకారులో ఎయిర్ పోర్ట్ కి రావటం.. ఆమెకు సెండాఫ్ ఇచ్చి వెళ్లటం కొన్ని కెమేరాలకు చిక్కేసిందట. తాజా ఉదంతంతో వీరిద్దరూ కలిసిపోయినట్లేనని చెబుతున్నారు. అయినా.. గుండె పగిలిందని పోస్ట్ చేసినప్పుడు.. అతుక్కున్న గుండె గురించిన అప్ డేట్ ఇవ్వకపోతే ఎట్లా కోహ్లీ..?