Begin typing your search above and press return to search.

కోహ్లీ టీష‌ర్ట్ చెప్పిన నిజం-అనుష్కతో ప్రేమ బ్రేక‌ప్

By:  Tupaki Desk   |   12 April 2016 11:37 AM GMT
కోహ్లీ టీష‌ర్ట్ చెప్పిన నిజం-అనుష్కతో ప్రేమ బ్రేక‌ప్
X
భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అటు మైదానంలో ఎంత పాపుల‌ర్ అయ్యాడో ఇటు బ‌య‌ట‌, సోష‌ల్ మీడియాలో కూడా అంతే పాపుల‌ర్ అయ్యాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ మెరుపులు మాత్రం ఆగ‌వు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క‌శ‌ర్మ‌తో కోహ్లీ న‌డిపిన ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళుతుంద‌నుకుంటున్న టైంలో స‌డెన్‌ గా వీరి ప్రేమ బ్రేక‌ప్ అయ్యింది.

కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందన్న రూమ‌ర్లు వినిపించాయి. ప్ర‌స్తుతం అనుష్క ఫామ్‌ లో ఉన్నందున ఇప్పుడే పెళ్లి వ‌ద్ద‌ని..కొద్ది రోజులు వాయిదా వేయ‌మ‌న‌డంతోనే వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక గ‌తంలో విరాట్ ఆడుతుంట‌నే గ్యాల‌రీలో అనుష్క చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా ఇండియాలోనే జ‌రిగిన 20-20 ప్ర‌పంచ‌క‌ప్‌ లో అనుష్క మాత్రం ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేదు.

అయితే అంద‌రికి షాక్ ఇస్తూ వీరు గ‌త వారం ముంబైలో డిన్న‌ర్ చేయ‌డంతో మ‌ళ్లీ ఈ ప్రేమ‌ప‌క్షులు ఒక్క‌ట‌య్యాయా అన్న అనుమానాలు అంద‌రికి క‌లిగాయి. దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే కోహ్లీ టీ షర్ట్‌ పై దర్శనమిచ్చిన ఓ సందేశంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంతకీ ఆ సందేశం ఏమిటంటే.. ‘We Were On A Break’ అని ఆ టీష్టర్‌ పై ఉంది. దీని అర్థం అనుష్కతో బంధాన్ని తెగతెంపులు చేసుకున్న‌ట్టే అని కోహ్లీ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశాడ‌ని ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంత‌కు కోహ్లీ అనుష్క‌తో బంధాన్ని బ్రేక‌ప్ చేసుకున్నాడా ? లేదా కంటిన్యూ చేస్తున్నాడా ? అన్న‌ది కోహ్లీ చెపితేనే కాని స‌స్పెన్స్ వీడేలా లేదు.