Begin typing your search above and press return to search.
వీడియో : కోహ్లీ భార్య అనుష్క ఛాలెంజ్ యాక్సెప్టెడ్
By: Tupaki Desk | 31 Oct 2021 3:30 AM GMTసోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా రెగ్యులర్ గా ఏదో ఒక ఛాలెంజ్ అనేది రన్ అవుతుంది. ఇది ఐస్ బకెట్ తో మొదలు అయ్యి ఆ తర్వాత రకరకాలుగా వచ్చింది. అమ్మాయిలకు ప్రత్యేక ఛాలెంజ్ లు.. అబ్బాయిలకు ప్రత్యేక ఛాలెంజ్ లు ఇప్పటి వరకు చూశాం. కొందరు సౌత్ వాళ్లు వంటల ఛాలెంజ్ లు కొన్ని చిల్లర పనుల ఛాలెంజ్ లు కూడా చేశారు. ఏ ఛాలెంజ్ అయినా కొన్ని రోజుల పాటు పీక్స్ లో ట్రెండ్ అవుతూ ఉంది. ఇక బాలీవుడ్ స్టార్స్ ఆ చాలెంజ్ లో పాల్గొంటే దేశం మొత్తం ఆ ఛాలెంజ్ తో ఊగి పోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జుగ్ను ఛాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది. ర్యాప్ సింగర్ బాద్షా ఈ చాలెంజ్ ను మొదలు పెట్టాడు. ఈ ఛాలెంజ్ లో భాగంగా నాలుగు రకాల స్టెప్పులను ఒకే సారి స్పీడ్ గా చేయాల్సి ఉంటుంది. చాలా విభిన్నమైన ఆ నాలుగు స్టెప్పులు ఒకేసారి అనుకరించడం అంటే మామూలు విషయం కాదు.
డాన్స్ లపై బాగా పట్టు ఉండటంతో పాటు.. చాలా విభిన్నమైన డాన్సర్స్ మాత్రమే దీన్ని చేయగలరు అనే టాక్ ఉంది. అలాంటి ఈ ఛాలెంజ్ ను చాలా ఈజీగా ఇప్పటికే ఆలియా భట్, సిద్దార్థ్ మల్హోత్ర, రణ్వీర్ సింగ్, కత్రీనా కైఫ్ మరియు వరుణ్ దావన్ వంటి స్టార్స్ చేశారు. కొందరు చేసిన ఈ ప్రయత్నం విఫలం అవ్వగా కొందరు మాత్రం సక్సెస్ ఫుల్ గా చేయడం జరిగింది. ఈ ఛాలెంజ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానులను ఈ ఛాలెంజ్ లోకి పలువురు సెలబ్రెటీలు ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను కోహ్లీ భార్య.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ యాక్సెప్ట్ చేసింది.
ఛాలెంజ్ లో భాగంగా అనుష్క శర్మ చాలా సింపుల్ గా ఆ డాన్స్ మూమెంట్స్ ను చేసేసింది. ఆ నాలుగు రకాల మూమెంట్స్ ను ఒక్కసారి కాదు రెండు సార్లు చేసేసింది. హీరోయిన్ గా మంచి ఫేమ్ ను దక్కించుకున్న ఈ అమ్మడు డాన్సర్ గా కూడా మంచి పేరును దక్కించుకుంది. అందుకే ఈ అమ్మడు ఈజీగా ఆ మూమెంట్స్ చేసిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. టీం ఇండియా స్టార్ క్రికెటర్ భార్య అయిన అనుష్క శర్మ మళ్లీ నటించే అవకాశం ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని ఆమెకు మాత్రం మళ్లీ నటించే ఆసక్తి ఉన్నట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్ట్ లను చూస్తుంటే అర్థం అవుతోంది.