Begin typing your search above and press return to search.
హాలీవుడ్‌ను తలదన్నేలా KOKO టీజర్
By: Tupaki Desk | 14 May 2023 8:13 PM ISTగతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్టాండర్డ్స్ భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకే ఇప్పటి దర్శకులు సరికొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటిని తలదన్నేలా సరికొత్త మూవీ రాబోతుంది. అదే భారతదేశపు మొదటి ప్రామాణికమైన సైంటిఫిక్ థ్రిల్లర్ 'కోకో (KOKO)'.
జై కుమార్ దర్శకత్వం వహిస్తోన్న 'కోకో (KOKO)' మూవీని మిరాయి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వాసా నిర్మిస్తున్నారు. సైబర్ యుద్ధాల నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రతీకార కథతో రాబోతుందని తెలుస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కనిపెట్టిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోడానికి ఓ హ్యాకర్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని తెలిసింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'కోకో (KOKO)' మూవీకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ప్రతి ఫ్రేంలో సరికొత్త టెక్నాలజీని వాడారు. దీంతో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
దీంతో ఈ వీడియో విడుదలైన కొద్ది టైంలోనే మంచి ఆదరణను అందుకుంది. తద్వారా ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆరంభంలోనే భారీ స్థాయిలో ఏర్పడ్డాయని చెప్పొచ్చు.
హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'కోకో (KOKO)' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను జూన్ మూడో వారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రం వియత్నాం, లడఖ్, చైనా, కేరళ, హైదరాబాద్‌లలో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించబోతుంది.
ఇక, 'కోకో (KOKO)' సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. 2024 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని ఏకంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, వియత్నామీస్, తైవాన్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా వచ్చిన టీజర్‌లో వెల్లడించారు.