Begin typing your search above and press return to search.
ఆ హీరోకు బాలయ్యపై అంత అభిమానమా?
By: Tupaki Desk | 9 March 2016 7:30 AM GMTహీరోల మీద అభిమానంతో తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకునే మామూలు ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. కానీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఇలా హీరోల మీద అభిమానంతో వారి పేర్లు పెట్టుకోవడం అరుదుగా జరుగుతుంది. ఐతే ఫేమస్ ఎడిటర్ కొడుకు కోలా భాస్కర్ కొడుకు మాత్రం నందమూరి బాలకృష్ణ మీద అభిమానంతో తన స్క్రీన్ నేమ్ గా ఆయన పేరే పెట్టుకోవడం విశేషం. ఈ కుర్రాడు తమిళంలో ‘మలై నేరత్తు మైకం’ అనే సినిమాలో నటించాడు. ‘7/జి బృందావన కాలనీ’కి కొనసాగింపుగా వచ్చిన సినిమా ఇది. సెల్వ రాఘవన్ భార్య గీతాంజలి దర్శకత్వం వహించింది.
తెలుగులో ఈ సినిమా ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అనే పేరుతో అనువాదమైంది. వాస్తవానికి ఈ హీరో పేరు వేరే కానీ.. స్క్రీన్ నేమ్ గా తన అభిమాన కథానాయకుడైన బాలకృష్ణ పేరు పెట్టుకున్నాడట. ముందు క్రిష్ అనే పేరు అనుకున్నప్పటికీ అది సెల్వ రాఘవన్ కు నచ్చకపోవడంతో బాలకృష్ణ అనే పేరునే ఖాయం చేశారట. ‘భలే మంచి రోజు’ ఫేమ్ వామికా గబ్బి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం విశేషం. తమిళంలో ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సెల్వ తరహాలోనే గీతాంజలి కూడా దర్శకురాలిగా తనదైన ముద్ర వేసింది. ఈ చిత్రానికి కథ అందించింది సెల్వనే. ‘7/జి బృందావన కాలనీ’ తరహాలోనే ఈ సినిమాలోనూ కంటెంట్ చాలా స్ట్రాంగ్ అని రివ్యూస్ వచ్చాయి. త్వరలోనే తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కాబోతోంది.