Begin typing your search above and press return to search.
ఆ వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ నయన్ ప్రియుడు
By: Tupaki Desk | 5 April 2019 6:40 AM GMTనయనతార ఇటీవల నటించిన హర్రర్ మూవీ 'కొలయుతిర్ కాలం'. విడుదలకు సిద్దం అయిన ఈ చిత్రం గురించి ఒకానొక సందర్బంలో నయన్ ప్రియుడు, కాబోయే భర్త విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ ఆ సినిమాను అసంపూర్తిగా చిత్రీకరించారు, అనుకున్నట్లుగా సినిమా రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల వల్ల సినిమాకు పెద్ద డ్యామేజ్ అయ్యింది. విఘ్నేష్ శివన్ మాటల వల్ల సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు. గతంలో కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ లు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు సినిమాను కొనేందుకు ఆసక్తి చూపడం లేదట. దాంతో నిర్మాత మథియా లగాన్ తీవ్ర స్థాయిలో విఘ్నేష్ శివన్ పై విరుచుకు పడుతున్నాడు.
తమ సినిమా గురించి ఆయనకు ఏం అవసరం అంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలకు కూడా సిద్దం అవ్వబోతున్నాడు. ఆయన వ్యాఖ్యలతో సినిమాకు జరిగిన నష్టంను ఆయనతోనే పూరించాలని నిర్మాత భావిస్తున్నాడు. విఘ్నేష్ వ్యాఖ్యలకు ముందు శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయి. అయితే ఇప్పుడు వారు డబ్బు చెల్లించకుండా ఆ హక్కులు తమకు వద్దని మొండి కేస్తున్నారట. ఇంకా ఇతర బయ్యర్లు కూడా సినిమాను విడుదల చేసేందుకు ఆసక్తి చూపడం లేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇదే సినిమా గురించి వివాదాస్పద నటుడు రాధ రవి కూడా మాట్లాడుతూ.. నయనతారను చూస్తే నిజంగా దెయ్యాలు భయపడతాయి, అలాంటిది ఆమె దెయ్యంగా నటిస్తే ఏంటీ పరిస్థితి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. పొందాల్సిన విమర్శలు పొందాడు. ఇప్పుడు విఘ్నేష్ శివన్ కూడా తన ప్రియురాలు నటించిన సినిమా కదా అని 'కొలయుతిర్ కాలం' సినిమా గురించి నోరు జారి చిక్కుల్లో పడ్డాడు. ఈ చిత్రం నష్టాలు మిగిల్చితే అది విఘ్నేష్ శివన్ వల్లే అంటూ నిర్మాత ఆరోపిస్తున్నాడు. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.