Begin typing your search above and press return to search.
వాళ్లు టాలీవుడ్ ను చూసి ఏడుస్తున్నారు
By: Tupaki Desk | 16 Jan 2017 5:30 PM GMTఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ తెలుగురాష్ట్రం వరకే ఉండేది. ఆ తర్వాత కొద్దిగా కర్ణాటక వైపు విస్తరించింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అది పెద్ద ఏరియా అయిన నైజాంతో సమానంగా ఓవర్సీస్ లో బిజినెస్ జరిగేంతగా అక్కడ మన సినిమాలకు మార్కెట్ విస్తరించడం గొప్ప విషయమే. మహేష్ బాబు సినిమాలతో మొదలైన ఓవర్సీస్ ఊపు.. ఇప్పుడు మిగతా హీరోల చిత్రాలకూ విస్తరించింది. మిలియన్ క్లబ్ అన్నది కలగా ఉన్న రామ్ చరణ్.. నందమూరి బాలకృష్ణ కూడా ఆ మార్కును టచ్ చేసేశారు. దాదాపుగా స్టార్ హీరోలందరికీ ఇప్పుడు మిలియన్ మార్కు అన్నది సునాయాసంగా మారిపోయిన పరిస్థితి.
ఐతే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు చూపిస్తున్నంత జోరు.. వేరే భాషల చిత్రాలకు లేదు. సౌత్ ఇండియలో కమర్షియల్ గా మన చిత్రాలకు దీటుగా వసూళ్లు రాబట్టే తమిళ సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ లేదు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయి.. వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే సినిమాలకు అక్కడ హాఫ్ మిలియన్ వసూళ్లు రావడం కూడా కష్టంగా ఉంది. సంక్రాంతికి వచ్చిన విజయ్ మూవీ ‘భైరవ’ యావరేజ్ టాక్ తోనూ తమిళనాట వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కానీ యుఎస్ లో మాత్రం ఆ సినిమా తుస్సుమంది. తెలుగు సినిమాలో అక్కడ ఇరగాడేస్తుంటే.. ‘భైరవ’ నామమాత్రంగా ఆడుతోంది. మిగతా తమిళ స్టార్ హీరోల పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. రజినీకాంత్ ఒక్కడే ఇందుకు మినహాయింపు. మరోవైపు బాలీవుడ్ సినిమాలు కూడా కొన్నిసార్లు తెలుగు చిత్రాల ముందు వెలవెలబోయే పరిస్థితి. ఖాన్ త్రయాన్ని మినహాయిస్తే మిగతా హీరోల సినిమాలకు అక్కడ తెలుగు చిత్రాల స్థాయిలో వసూళ్లు ఉండవు. ఏ పెద్ద తెలుగు సినిమా వచ్చినా.. యుఎస్ బాక్సాఫీస్ లో వసూళ్ల వర్షం కురవడం చూసి ఇటు కోలీవుడ్.. అటు బాలీవుడ్ జనాలు అసూయ చెందుతుంటారనడంలో సందేహమే లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/