Begin typing your search above and press return to search.
ఈ విషయంలో టాలీవుడ్ నుంచే వాళ్లకు స్ఫూర్తి
By: Tupaki Desk | 17 March 2021 1:30 PMతెలుగు చిత్రపరిశ్రమలో `నేను సైతం` అంటూ సాయానికి కదిలి వచ్చే తత్వం సర్వత్రా ప్రశంశలు అందుకుంది. ప్రకృతి వైపరీత్యాలు ప్రజల కష్టాల వేళ ఆదుకునేందుకు అన్నివేళలా తెలుగు చిత్రపరిశ్రమ ముందుకొస్తుంటుంది. అలాగే ఒక హీరో సినిమా బంపర్ హిట్ కొడితే మరో హీరో అభినందించడం.. అలాగే కథానాయకులంతా ఒక చోట చేరి సెలబ్రేషన్ పేరుతో కలిసిపోవడం ..ఇవన్నీ నిరంతరం చూసేవే. ఇక దర్శక సంఘం రచయితల సంఘం సత్కారాలు అభినందన సభలతో టాలీవుడ్ లో మంచి కల్చర్ కనిపిస్తుంది. యువదర్శకులు.. రచయితలు ఏదైనా ఘనత సాధిస్తే అసోసియేషన్లు సత్కరిస్తున్నాయి. ఇలాంటి మంచి కల్చర్ ని తెలుగు సినీపరిశ్రమ కొనసాగిస్తోంది.
ఇరుగు పొరుగు పరిశ్రమలకు ఇది స్ఫూర్తివంతమైనది. తాజాగా కోలీవుడ్ లో ఓ ఈవెంట్ అన్ని పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు (మార్చి 13న)ను ఆయన జీవితంలో ఎన్నటికీ మరపురానిదిగా సెలబ్రేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.
ఈ పుట్టినరోజు వేడుకలకు కోలీవుడ్ అగ్ర దర్శకులు మణిరత్నం- శంకర్- లింగుసామి- గౌతమ్ మీనన్- శశి- వసంతబాలన్ హాజరయ్యారు. అంత పెద్ద దర్శకులు ఓ యువదర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అలాగే ఆ వేడుకల్ని దగ్గరుండి జరిపించడం అంటే అతడికి దక్కిన గౌరవం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది అతడికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ లాంటిదని భావించవచ్చు.
కేవలం మూడు సినిమాల కిడ్ అయిన లోకేష్ కనగరాజ్ కోసం అంతటి ప్రముఖులే దిగొచ్చి ఆశీస్సులు అందించడం అభిమానుల్లోనూ చర్చకు వచ్చింది. 2016లో అవియల్ అనే వెబ్ సిరీస్ తో కెరీర్ ప్రారంభించిన లోకేష్ ఆరంభం లఘు చిత్రాలతో పాపులరయ్యారు. మానగరం- ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్లను తెరకెక్కించి ఏకంగా దళపతి విజయ్ తో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. సంక్రాంతి బరిలో రిలీజై తమిళనాట బ్లాక్ బస్టర్ విజయం సాధించిన `మాస్టర్` కి అతడు దర్శకుడు. కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న దర్శకుడిగానూ వెలుగుతున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ కథానాయకుడిగా విక్రమ్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు లోకేష్.