Begin typing your search above and press return to search.

కోలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో లైట్ తీసుకుంది!

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:52 AM GMT
కోలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో లైట్ తీసుకుంది!
X
టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా సౌత్ లో ఒక్క త‌మిళ్ త‌ప్ప మిగ‌తా భాష‌ల్లో త‌మ సినిమాల్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అలాగే హిందీలోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తెలుగు త‌ర్వాత హిందీ రిలీజ్ నే ప్ర‌ధాన టార్గెట్ గా భావిస్తున్నారు. మ‌రి టాలీవుడ్ పై మ‌నోళ్లు ఏ కార‌ణంగా పెద్ద‌గా దృష్టి సారించ‌డం లేదు అంటే? అందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి.

భాషాప్ర‌యుక్త రాష్ర్టాలుగా ఏర్పాటైన నాటి నుంచి తెలుగు వాళ్ల‌పై వివ‌క్ష‌భావాన్నిచాలా కాలం పాటు త‌మిళులు చూపించారు. ఇప్ప‌టికీ ఆ ప్ర‌భావం ఉంది. తెలుగు సినిమా త‌మిళ్ లో రిలీజ్ అవుతుందంటే? అక్క‌డి ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆద‌రించ‌రు. అందుకు ఇప్ప‌టికే రిలీజ్ అయిన చాలా చిత్రాల్ని ఉద‌హ‌రించవ‌చ్చు. త‌మిళ‌నాడు మిన‌హా మిగ‌తా అన్నిరాష్ర‌ల క‌లెక్ష‌న్స్ బాగుంటాయి.

మ‌రి దీనికి కార‌ణం ఏమై ఉంటుందంటారు? అక్క‌డ కేవ‌లం త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డిన తెలుగు ఆడియ‌న్స్ త‌ప్ప స్థానికుల నుంచి ఆద‌ర‌ణ ఉండ‌దు అని చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్ప‌టికీ ఆ ర‌క‌మైన సంస్కృతి అక్క‌డ ఆచ‌ర‌ణ‌లోనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆకార‌ణంగానే అప్ప‌ట్లో సైరా న‌ర‌సింహారెడ్డి కి సంగీతం అందించ‌లేద‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అలాగే త‌మిళ ప‌రిశ్ర‌మ టెక్నిషీనయ‌న్ల‌పై టాలీవుడ్ చాలా కాలంపాటు ఆధార‌ప‌డింది. అయితే ఈ వివ‌క్ష ధోర‌ణికి టాలీవుడ్ ఎప్పుడో చ‌ర‌మ‌గీతం పాడేసింది. అక్క‌డ తెలుగు సినిమా రిలీజ్ లు అవ‌స‌ర‌మైతే చేస్తున్నారు త‌ప్ప‌! లేదంటే అక్క‌డ రిలీజ్ లు చాలా రేర్. ఇప్పుడు పూర్తిగా కోలీవుడ్ మార్కెట్ ని లైట్ తీసుకుంది. త‌మిళ న‌టులే టాలీవుడ్ వైపు చూస్తున్న స‌న్నివేశం క‌ళ్ల ముందు కనిపిస్తుంది.

మ‌మ్మ‌ల్ని ఆద‌రించండి అంటూ తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌మిళ హీరోలు చేతులు జోడించి అడుగుతున్నారు. అక్క‌డి ద‌ర్శ‌కులు టాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. తెలుగు హీరోలు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవ్వ‌డంతో ఈ అవ‌కాశ‌న్ని ఎలాగైనా వినియోగించుకోవాల‌ని త‌మిళ టెక్నీషిన్లు అంతా టాలీవుడ్ వైపు చూస్తున్నారు. బాలీవుడ్ హీరోలే తెలుగు వైపు చూస్తుంటే? మిగ‌తా భాష‌ల గురించి చ‌ర్చ‌ల కూడా వృద్ధా ప్ర‌య‌త్న‌మే అవుతుంది. అదీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.