Begin typing your search above and press return to search.
`కల్కి` బిజినెస్ పై కొత్త లీక్
By: Tupaki Desk | 22 April 2019 6:32 AM GMTసీనియర్ నటుడు.. యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న `కల్కి` ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. `అ!` ఫేం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళికల్లో ఉంది. అయితే కల్కి ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ట్రేడ్ లో రకరకాలుగా చర్చ సాగుతోంది. ఈ సినిమాకి నిర్మాత సి.కళ్యాణ్ భారీ గా హైప్ పెంచి బిజినెస్ చేస్తున్నారని.. దీంతో ట్రేడ్ లో కదలిక లేదని వార్తలొచ్చాయి.
అయితే అవేవీ నిజాలు కావు అంటూ `కల్కి` బిజినెస్ గురించి మరో కొత్త లీక్ అందింది. కల్కి బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. దాదాపు 12కోట్లు వెచ్చించి ప్రముఖ నిర్మాత రాధా మోహన్ ప్రపంచవ్యాప్త రిలీజ్ హక్కుల్ని చేజిక్కించుకున్నారని ప్రచారం సాగుతోంది. అలాగే ఈ సినిమాని కొనేందుకు తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఆసక్తిగా ఉన్నారు. ధనుష్ కి చెందిన వండర్ బార్ ఫిలింస్ సంస్థ ఇండియా వైడ్ రైట్స్ ని ఛేజిక్కించుకోవాలని ప్రయత్నించింది. తెలుగు మార్కెట్లోనూ ధనుష్ ప్రవేశించాలని భావించారట. కానీ రాధా మోహన్ తో డీల్ పూర్తవ్వడంతో కుదరలేదని మరో ఆసక్తికర ప్రచారం సాగుతోంది.
అయితే కల్కి బిజినెస్ విషయంలో నిజానిజాలెంత? అన్నది అటుంచితే ఈ సినిమాకి అంతకంతకు హైప్ పెంచేందుకు చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు పాటిస్తోందని అర్థమవుతోంది. పీఎస్ వి గరుడ వేగ చిత్రంతో రీబూట్ అయ్యారు రాజశేఖర్. అందుకే ఇదే అదనుగా మార్కెట్ వర్గాల్లోనూ స్పీడ్ ఉందని నిరూపించుకునే పనిలో ఉన్నారా? అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. టీజర్ చూసిన అనంతరం ట్యాలెంటెడ్ ప్రశాంత్ వర్మపైనా నమ్మకం మరింత పెరిగింది. రాజశేఖర్ ని పోలీసాఫీసర్ గా సినిమాలో ఎంత స్టైలిష్ గా చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ పెంచగలిగారు. 12 కోట్లకు థియేట్రికల్ హక్కులు ఛేజిక్కించుకున్నారు అంటే .. ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. గ్రాస్ ఆల్మోస్ట్ డబుల్ వసూలవ్వాలి. మరి రాజశేఖర్ ఈసారి ఆ ఫీట్ వేస్తారా? అన్నది చూడాలి.