Begin typing your search above and press return to search.
వాల్మీకి కోసం కోలీవుడ్ హీరో..
By: Tupaki Desk | 18 Feb 2019 5:27 AM GMTతన సినిమా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నచిత్రాలను చేసుకుంటూ పోతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ‘కంచె’ నుంచి మొదలుపెడితే.. నేటి ‘అంతరిక్షం’ వరకూ ఎవ్వరూ టచ్ చేయని జోనర్లను వరుణ్ తేజ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటున్నారు.
తాజాగా స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో వరుణ్ తేజ్ ఓ నెగెటివ్ రోల్ ఉన్న పాత్రను చేసేందుకు ముందుకు రావడం విశేషంగా చెప్పవచ్చు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ను వరుణ్ రిమేక్ చేస్తున్నాడు. ఇది తెలుగులో ‘వాల్మీకి’గా వస్తోంది. ఈ సినిమాలో వరుణ్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు.
ఈ సినిమాలో మరో కీలక పాత్రకోసం మొదట తెలుగు హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణులను దర్శకుడు హరీష్ అనుకున్నట్టు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం తమిళనటుడిని ఇందుకోసం తీసుకుంటున్నారట.. ఈపాత్ర కోసం తమిళ హీరో అధ్వర్యను హరీష్ సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. వాల్మీకి చిత్రంతోనే ‘అధర్వ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘వాల్మీకి’ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.