Begin typing your search above and press return to search.

రీల్‌ హీరోలు రియల్ హీరోలైన వేళ

By:  Tupaki Desk   |   5 Dec 2015 9:30 AM GMT
రీల్‌ హీరోలు రియల్ హీరోలైన వేళ
X
చెన్నైని ముంచెత్తిన వరదలు.. కోలీవుడ్ హీరోల్లో హీరోయిజాన్ని బయటకు తెచ్చాయి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తున్నా, ఆర్మీ-ఎన్డీఆర్ ఎఫ్ దళాలు రంగంలోకి దిగినా.. తమ వంతు సాయం అందించేందుకు తమిళ హీరోలందరూ రంగంలోకి దిగారు. హీరో సిద్ధార్ధ్ - రేడియో జాకీ బాలాజీ ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. నిజానికి చెన్నై వరదలకు సిద్ధార్ధ్ ఒక బాధితుడు కూడా.

అయితే.. దీని నుంచి త్వరగా కోలుకుని బాలాజీతో కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టాడు. చుట్టుపక్కల వాళ్ల కార్లను, వాహనాలను అడిగి తీసుకుని మరీ సాయం చేస్తున్నాడు. వీరికి విశాల్ - ఉదయనిధి స్టాలిన్ - కార్తి - కుష్బూ సుందర్ - విశాల్ కృష్ణా రెడ్డి జతయ్యారు. ఎస్పీఐ సినిమాస్ - ఏజీఎస్ సినిమాస్ అనే మల్టీప్లెక్సుల ఓనర్లతో మాట్లాడి పునరావాసం ఏర్పాటు చేయడం విశేషం. ఇద్దరితో మొదలైన ఈ టీంలో.. ఇప్పుడు చాలామంది స్వచ్ఛందంగా జతయ్యారు.

"సిద్ధార్ - బాలాజీలు చేపట్టిన చర్యలు మమ్మల్ని కదిలించాయి, అందుకే మా అంతటమేమే వారితో కలిసి ప్రజలకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాం" అంటున్నారు వాలంటీర్లు. వీరంతా కలిసి నగరమంతా తిరిగి ఆహార పొట్లాను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు. ఇలా తిరిగి సాయం చేయలేని వాళ్లను.. ఎంత చిన్న మొత్తమైనా సరే నిధుల రూపంలో అందించి సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇందుకు సోషల్ మీడియా కూడా వీళ్లకు బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఒకరిని ఒకరు కలిపేందుకు సోషల్ మీడియాను, ట్విట్టర్ ను వేదికగా చేసుకుని సమాచారం పంచుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసుకుంటూ, తెలుసుకుంటూ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో గుడ్డి చిన్నారులకు ఇళయరాజా దగ్గరుండి సాయం చేస్తున్నారు. దాదాపు కోలీవుడ్ అంతా కదిలొచ్చి, చెన్నై ప్రజలకు అండగా నిలవడం అభినందించగ్గ విషయం.