Begin typing your search above and press return to search.
తమిళ పొంగల్.. మనకంటే హాటే
By: Tupaki Desk | 18 Nov 2015 10:30 PM GMTతెలుగు సినిమాకు అతి పెద్ద పండగ సీజన్ అంటే సంక్రాంతే. దసరా - దీపావళి పండగలకీ సందడి ఉంటుంది కానీ.. సంక్రాంతికి ఉన్నంత కాదు. ఒకప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాలు సంక్రాంతి సీజన్ లో పోటీకి నిలిచేవి. కానీ గత కొన్నేళ్లుగా అంత సందడి ఉండట్లేదు. మహా అయితే రెండు పెద్ద సినిమాలే రిలీజవుతున్నాయి. ఐతే ఈ ఏడాది కనీసం రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి పలకరించవచ్చని అంచనా. ప్రస్తుతానికి నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ - సోగ్గాడే చిన్నినాయనా - కృష్ణాష్టమి రేసులో ఉన్నాయి. వీటిలో చివరికి ఎన్ని పోటీలో మిగులుతాయో చూడాలి.
మరోవైపు తమిళనాట సంక్రాంతికి మనకంటే కూడా భారీగానే పోటీ ఉండబోతోంది. ముందు వేసవికి అనుకున్న సూర్య సినిమా ‘24’ను పొంగల్ కే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రజినీ - కమల్ - విజయ్ - అజిత్ లాంటి బిగ్ స్టార్స్ ఎవరూ పోటీలో లేని నేపథ్యంలో వాళ్ల తర్వాత ఎక్కువ క్రేజ్ ఉన్న తాను సంక్రాంతి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడట సూర్య. ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి పొంగల్ కి ‘24’ను విడుదల చేయాలని చూస్తున్నాడు. మరోవైపు శింబు - నయనతార జంటగా నటించిన ‘ఇదు నమ్మ ఆళు’ కూడా పండక్కే వస్తోంది. కొన్ని నెలల కిందటే ‘తనీ ఒరువన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన జయం రవి తన కొత్త సినిమా ‘మిరుతన్’ను సంక్రాంతి పోటీలో నిలుపుతున్నాడు. మన తెలుగు తేజం విశాల్ కూడా ‘కథాకళి’ అంటూ పొంగల్ రేసులోకి వస్తున్నాడు. బాల సినిమా ‘తారై తాపట్టై’.. త్రిష - హన్సిక - సిద్దార్థ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న హార్రర్ కామెడీ ‘ఆరణ్మయి-2’ కూడా సంక్రాంతికే పోటీ పడబోతుండటం విశేషం. మొత్తంగా ప్రస్తుతానికి అరడజను తమిళ సినిమాలు పొంగల్ రేసులో ఉన్నాయి.