Begin typing your search above and press return to search.

దీపావళికి వాళ్లదే రచ్చ రంబోలా

By:  Tupaki Desk   |   4 Oct 2016 1:30 AM GMT
దీపావళికి వాళ్లదే రచ్చ రంబోలా
X
తెలుగు సినిమాలకు సంక్రాంతికి మించి పెద్ద సీజన్ మరేదీ ఉండదు. ఆ తర్వాత దసరా మీద ఫోకస్ ఉంటుంది. ఐతే తమిళ పరిశ్రమ మాత్రం అలా కాదు. వాళ్లు సంక్రాంతికి బాగానే ప్రయారిటీ ఇస్తారు కానీ.. దాని కంటే దీపావళి మీద ఫోకస్ ఎక్కువుంటుంది. ప్రతి ఏడాది ఆ పండక్కి పోటీ ఎక్కువుంటుంది. అది కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్ని దీపావళి రిలీజ్ కోసం షెడ్యూల్ చేసుకుంటారు. దసరాకు శివకార్తికేయన్ సినిమా ‘రెమో’ ఒక్కటే చెప్పుకోదగ్గ డైరెక్ట్ మూవీ. ‘అభినేత్రి’ తమిళ వెర్షన్ ‘దేవి’ కూడా ఈ పండక్కే రిలీజవుతోంది. ఐతే దీపావళికి మాత్రం పోటీ బాగా ఎక్కువుంది. ఈ పండక్కి నాలుగు సినిమాలు రిలీజవుతుంటే.. ఆ నాలుగూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే.

దీపావళికి రాబోయే తమిళ సినిమాల్లో ముందు చెప్పుకోవాల్సింది ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కోడి’ గురించే. వరుసగా మూడు ఫ్లాపులు తిన్న ధనుష్ ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. అతను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. ఇక సెకండ్ ప్రయారిటీ కార్తి సినిమా ‘కాష్మోరా’కు ఇవ్వాలి. పీవీపీ సంస్థ రూ.60 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. గోకుల్ దర్శకత్వం వహించాడు. ఇందులో కార్తి గెటప్ భలే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ రెండు కాకుండా విశాల్ సినిమా ‘కత్తి సెండై’ కూడా దీపావళికే షెడ్యూల్ అయి ఉంది. మరోవైపు ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ‘సైతాన్’ కూడా దీపావళికే రాబోతోంది. ఈ నాలుగు సినిమాలూ తెలుగులోనూ అనువాదమై ఒకేసారి విడుదల కాబోతుండటం విశేషం. వీటి మధ్య పోటీకి ఏదైనా డైరెక్ట్ తెలుగు సినిమా కూడా వస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/