Begin typing your search above and press return to search.
'ఆచార్య' విడుదల రోజునే కోలీవుడ్ స్టార్ హీరో సినిమా..!
By: Tupaki Desk | 19 Nov 2021 5:30 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెండు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. గతేడాది విడుదలైన 'ఆకాశం నీ హద్దురా'.. ఇటీవల వచ్చిన 'జై భీమ్' సినిమాలు అశేష ప్రేక్షకాదరణ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా కరోనా కారణంగా డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ అయిన సినిమాలు. విజయవంతం అయినప్పటికీ బిగ్ స్క్రీన్ మీద ఈ చిత్రాలు విడుదల కాకపోవడంపై ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో తదుపరి మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని సూర్య స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు.
పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్న తన 40వ సినిమా 'ఎత్తారెక్కుమ్ తునిందవన్' ను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు సూర్య ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని శుక్రవారం మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్య ఇందులో తెల్ల పంచె, ఎర్ర చొక్క ధరించి మాస్ బీట్ కి అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. అలానే ఈ సినిమాలో యాక్టన్ పాళ్ళు కూడా కాస్త ఎక్కువే అని హింట్ ఇచ్చారు. సూర్య మరోసారి ఊరమాస్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.
'ఎత్తారెక్కుమ్ తునిందవన్' చిత్రాన్ని ఫ్యామిలీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. రెండేళ్ల తర్వాత వెండితెరపై సూర్య కనిపించే సినిమా కావడంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సూర్య సరసన 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ - సూరి - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - వినయ్ రాయ్ - సుబ్బు పంచు - దేవదర్శిని - ఎం.ఎస్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డి. ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తుండగా.. తమిళ హీరో శివ కార్తికేయన్ - దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్ పాటలకు సాహిత్యం అందిస్తుండటం విశేషం. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. జాకీ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'కేజీఎఫ్' ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు - అరివ్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సూర్య - పాండిరాజ్ కాంబోలో గతంలో 'పసంగ 2'(మేము) అనే సినిమాని వచ్చింది. ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న 'ఎత్తారెక్కుమ్ తునిందవన్' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే తెలుగులో సూర్య కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ప్రతి చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేస్తుంటారు. 'ఎత్తారెక్కుమ్ తునిందవన్' చిత్రాన్ని కూడా తెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న 'ఆచార్య' సినిమా థియేటర్లలోకి రానుంది. మరి తెలుగులో మెగా సినిమాకు పోటీగా సూర్య మూవీ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.