Begin typing your search above and press return to search.
విషమం గా రజనీ ఆరోగ్యమన్న వార్తల వేళ.. ఆయనకెలా ఉంది?
By: Tupaki Desk | 29 Oct 2021 5:22 AM GMTఅది గో తోక అంటే ఇది గో పులి అన్న చందం గా ఈ మధ్య కాలం లో ప్రముఖుల కు సంబంధించిన ఆరోగ్య.. వ్యక్తి గత వార్తల విషయం లో ఇష్టా రాజ్యం అన్నట్లు గా సాగుతోంది. ఎవరైనా ప్రముఖుడు చిన్నపాటి అనారోగ్యం కారణం గా ఆసుపత్రి లో చేరితే చాలు.. తమ మనసు లోని అనారోగ్యాలన్ని సదరు ప్రముఖుడి కి కట్టబెట్టి.. పరిస్థితి క్రిటికల్ ఉందన్నట్లు గా వార్తలు వండేయటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజా గా తమిళనాడు సూపర్ స్టార్ రజనీ విషయం లోనూ ఇలానే జరిగింది.
రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రి కి వెళ్లిన తమిళనాడు సూపర్ స్టార్ ఆరోగ్యం ఏ మాత్రం బాగో లేదని.. ఆయన ఆరోగ్యం విషమం గా ఉన్నట్లు గా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రజనీ సతీమణి లతా స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితమే షూట్ ముగించుకొని ఢిల్లీ నుంచి చెన్నై కి వచ్చిన రజనీ.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యయుల తో కలిసి తాను నటించి.. తాజా గా విడుదల కానున్న ‘అన్నాత్తే’ మూవీని చూశారు.
ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రి లో రజనీకాంత్ చేరినట్లు గా వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు బాగానే ఉన్న ఆయనకు.. ఉన్నట్లుండి ఇప్పుడేమైంది? అసలేమైంది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి కి సమాధానం లభించేలోపే.. రజనీ ఆరోగ్యం విషమం గా ఉన్నట్లు గా వార్తలు రావటం తో ఆయన అభిమాను ల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో.. రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైన వేళ.. రజనీ సతీమణి లత మీడియా కు ఒక ప్రకటన చేశారు. అందు లో తన భర్త ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి క్రిటికల్ పరిస్థితి లేదని పేర్కొన్నారు.
రజనీ కాంత్ ఎప్పటి లానే రోటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రి కి వచ్చారని.. ఆయన ఆరోగ్యం గా ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు చేస్తున్న పరీక్షలు ప్రతి ఏటా చేస్తుంటామని.. అన్ని రెగ్యులర్.. రోటీన్ చెకప్ లుగా పేర్కొన్నారు. తొలుత గురువారం రాత్రి సమయాని కి ఇంటికి చేరుకుంటారని చెప్పినా.. శుక్రవారం మొత్తం వైద్యుల పర్యవేక్షణ లో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే.. బయట జరుగుతున్నట్లుగా రజనీ ఆరోగ్యం విషమం గా లేదని.. అదే సమయం లో రజనీ సతీమణి లత పేర్కొన్నట్లు గా రోటీన్ చెక్ కాదన్న మాట వినిపిస్తోంది. తలనొప్పి తో పాటు ఇతర అస్వస్థ తో ఆసుపత్రి లో చేరారని.. శుక్రవారం మొత్తం వైద్యులు ఆయన కు వివిధ పరీక్షలు చేయనున్నట్లు గా సమాచారం. ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి రజనీ కుమార్తె ఐశ్వర్య ఆసుపత్రి కి రావటం గమనార్హం. మొత్తం గా చూస్తే రజనీ ఆరోగ్యం సీరియస్ గా లేకున్నా.. అంతా నార్మల్ గా ఉందని చెబుతున్న మాట ల్లోనే నిజం లేదంటున్నారు. ఇప్పుడెలా ఉందన్న విషయాని కి సంబంధించి ఆసుపత్రి వర్గాలు అధికారికం గా ఒక హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తే అనవసరమైన అయోమయాలు తగ్గుతాయన్న మాట వినిపిస్తోంది.