Begin typing your search above and press return to search.
థియేటర్లలో రిలీజ్ కోసం తంబీలు వెయిటింగ్
By: Tupaki Desk | 29 Nov 2020 11:30 PM GMTఓవైపు మహమ్మారీ క్రైసిస్ వదల బొమ్మాళీ అన్న తీరుగా ఇంకా ఎటూ పోలేదు. అయినా అన్ లాక్ నిబంధనల వల్ల థియేటర్లు తెరిచేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లకు ప్రభుత్వాల నుంచి లైన్ క్లియరైంది. అటు తమిళ సినిమాల పరిస్థితేమిటి? అన్నది ఆరా తీస్తే.. అక్కడ అగ్ర హీరోలంతా థియేట్రికల్ రిలీజ్ ల కోసమే వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల విజయ్ .. ధనుష్ వంటి స్టార్లు నటించిన భారీ చిత్రాలు ఓటీటీల్లో రిలీజైపోతున్నాయన్న ప్రచారం హోరెత్తింది. కానీ దానికి సదరు హీరోలు ఏమాత్రం ఆసక్తిగా లేరు. అదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టి పారేస్తున్నారు.
విజయ్ నటించిన మాస్టర్ ఓటీటీలో రాదని థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. మాస్టర్ కి 100 కోట్ల మేర ఓటీటీ ఆఫర్ వచ్చినా విజయ్ టీమ్ కాదనుకున్నారని ప్రచారమవుతోంది. ఆ క్రమంటోనే మాస్టర్ ప్రెస్ నోట్ వైరల్ గా మారింది.
ఆ ప్రెస్ నోట్ కం ప్రకటనకు ‘అవును’ అని సమాధానం ఇచ్చారు ధనుష్. అంటే తమిళంలో తన చిత్రం ‘జగమే తందిరామ్ (తెలుగులో ‘జగమే తంత్రం’) నేరుగా ఒటీటీల్లో విడుదలవ్వదని ధనుష్ కన్ఫామ్ చేశారన్నమాట. మాస్టర్ లానే తమ సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ కి వస్తుందని చెప్పకనే చెప్పారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సహా సినిమా నిర్మాతలు తమ సినిమాను థియేటర్లలో విడుదల చేయటానికి వేచి ఉండాలని భావిస్తున్నారట.
`మాస్టర్` పత్రికా ప్రకటనకు ధనుష్ పరోక్ష సంజ్ఞ తమ మూవీ రిలీజ్ కి సంబంధించిన వైఖరిని నిర్ధారిస్తుంది. పెద్ద సినిమాలు OTT డైరెక్ట్ రిలీజ్‌ల వైపు చూడటం లేదు. ఎందుకంటే థియేటర్లు పెద్ద రిలీజ్ లతోనే వెలుగు చూడగలవు. అగ్ర హీరోల సినిమాలొస్తే జనం థియేటర్లకు కదిలే వీలుంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ల రికవరీ ఎల్లపుడూ థియేటర్లలో రిలీజైతేనే సాధ్యం అన్నది అందరికీ తెలిసినదే.