Begin typing your search above and press return to search.
'కొమ్మా ఉయ్యాలా' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!
By: Tupaki Desk | 16 April 2022 12:30 PM GMTఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పిరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా "ఆర్.ఆర్.ఆర్" (రౌద్రం రణం రుథిరం). మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే 1000 కోట్ల మార్క్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో RRR సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించిన పాటల వీడియోలను మేకర్స్ ఒక్కటొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవల వదిలిన 'నాటు నాటు' వీడియో సాంగ్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో సాగుతోంది. ఈ క్రమంలో లేటెస్టుగా "కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల" అనే మరో వీడియో సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'కొమ్మా ఉయ్యాల' పాట ఆర్.ఆర్.ఆర్ సినిమాకు చాలా కీలకం. ఈ పాట పాడిన మల్లి అనే చిన్నారిని బ్రిటీష్ దొరసాని ఎత్తుకుపోవడంతోనే ఈ కథ మొదలవుతుంది. ఇప్పటి వరకు ఈ పాట ఆడియో కూడా విడుదల కాలేదు. దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు భాషల్లో ఫుల్ వీడియో సాంగ్ ను వదిలారు.
'కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల.. అమ్మ ఒడిలో నేను రోజూ ఊగాలా.. రోజూ ఊగాలా' అంటూ సాగిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి అద్భుతంగా ఆలపించింది. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.
ఇందులో బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ చేస్తూ మల్లి తన అందమైన గొంతుతో అందరినీ హత్తుకునేలా ఈ పాట పాడుతూ ఉంటుంది. చిన్నారి ప్రతిభను మెచ్చిన ఆమె తిరిగి కోటకు వెళ్లేటప్పుడు మల్లిని అన్యాయంగా తీసుకెళ్లడం భావోద్వేగానికి గురి చేస్తుంది. మల్లికి తన తల్లితో ఉన్న అనుబంధాన్ని కూడా ఈ పాటలో చూడొచ్చు.
మల్లి ఢిల్లీ కోటలో బందీ అయిన క్షణాలు.., చివర్లో కొమురం భీమ్ గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ ఆమెను భుజాన ఎక్కించుకుని తిరిగి అడవికి తీసుకొచ్చే సన్నివేశాలను ఈ సాంగ్ లో చూపించారు. ఇప్పుడు 'కొమ్మా ఉయ్యాల..' పాట నెట్టింట సందడి చేస్తోంది.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియా - సముద్ర ఖని - రాహుల్ రామకృష్ణ - ఛత్రపతి శేఖర్ - మర్కండే దేశ్ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కేవీ విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాయగా.. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో RRR చిత్రాన్ని నిర్మించారు.