Begin typing your search above and press return to search.

Ind Vs NZ మ్యాచ్ లో కొమురం భీముడో

By:  Tupaki Desk   |   18 Jan 2023 4:05 AM GMT
Ind Vs NZ మ్యాచ్ లో కొమురం భీముడో
X
హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో భారత్ వన్డే మ్యాచ్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ నిన్న(జ‌న‌వ‌రి 17న) టీమిండియా క్రికెటర్లతో సమావేశమైన సంగతి తెలిసిందే.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ కు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి మ్యాచ్ కు హాజరయ్యే అవకాశం ఉంద‌ని స‌మాచారం. అయితే దీనిపై తారక్ టీమ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. యాధృచ్ఛికంగా ఎన్టీఆర్ నిన్న టీమిండియా స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్ - యూజీ చాహల్ - ఇషాన్ కిషన్- శార్దూల్ ఠాకూర్ -శుభ్ మన్ గిల్ లతో సమావేశమయ్యారు.

తార‌క్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా క‌థానాయిక స‌హా ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి ఉంది. నాటునాటుతో గోల్డెన్ గ్లోబ్ అందుకున్న కిక్కులో ఉన్న తార‌క్ అంతే జోష్ తో సెట్స్ పైకి వెళ్ల‌నున్నాడు.

పాన్ ఇండియా ట్రెండ్ లో బ‌హుభాష‌ల్లో భారీ కాన్వాసుతో తెర‌కెక్కే సినిమా కావ‌డంతో కొర‌టాల మూవీ చిత్రీక‌రణ ఆల‌స్య‌మైంద‌ని ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ సాగుతోంది. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్- మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా కోసం తార‌క్ చ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.