Begin typing your search above and press return to search.
'గల్లీ రౌడీ' హిట్ కొట్టడం ఖాయం .. ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఉంది: కోన వెంకట్
By: Tupaki Desk | 16 Sep 2021 5:30 AM GMTతెలుగు చిత్రపరిశ్రమలో కోన వెంకట్ కి మంచి పేరు ఉంది. కథా రచయితగా ... సంభాషణల రచయితగా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అలా ఆయన పనిచేసిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఇక నిర్మాతగా కూడా ఆయన వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నారు. ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఆయన నిర్మించిన సినిమనే 'గల్లీ రౌడీ'. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాను గురించి కోన వెంకట్ మాట్లాడారు.
"ఎవరు ఎన్ని చెప్పినా సినిమాను గురించి మాట్లాడవలసింది సినిమానే. అందువల్లనే నేను సినిమాను గురించి తరువాత మాట్లాడతాను. ఈ సినిమా పోస్టర్లపై ఒక 'ఢీ' .. ఒక 'రెడీ' .. ఒక 'దూకుడు' అని ఎందుకు పెట్టామంటే, ఆ కోవలోకి ఈ సినిమా చెందుతుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఈ సినిమాకి సంబంధించి నాకు బలమైన సెంటిమెంటు ఒకటి ఉంది. కథారచయితగా .. స్క్రీన్ ప్లే రచయితగా .. డైలాగ్ రైటర్ గా నేను ఫస్టు టైమ్ ఏ హీరోతో పనిచేసినా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఫస్టు టైమ్ విష్ణుతో 'ఢీ' అనే సినిమాను చేశాను .. అది బ్లాక్ బస్టర్ అయింది. ఫస్టు టైమ్ రామ్ తో 'రెడీ' చేశాను .. ఫస్టు టైమ్ ఎన్టీఆర్ తో 'అదుర్స్' చేశాను .. ఫస్టు టైమ్ మహేశ్ బాబుతో 'దూకుడు' చేశాను. ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఆ సెంటిమెంట్ 'గల్లీ రౌడీ'కి వర్తిస్తుంది. ఎందుకంటే సందీప్ కిషన్ తో నేను ఫస్టు టైమ్ చేస్తున్న సినిమా ఇది. సందీప్ కిషన్ ఎక్కడా కూడా నటిస్తున్నట్టుగా కనిపించడు. కాలనీలో కుర్రాడిలా కనిపిస్తూ, సినిమా .. సినిమాకి తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ సినిమా ఆయన గ్రాఫ్ ను మరింత పెంచే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాకి మాకు ఇంతటి ఊపు .. ఊతం .. ఎంకరేజ్ మెంట్ ఇచ్చింది చిరంజీవి గారు. మా కోసం ఆయన చాలా సమయాన్ని కేటాయించారు. ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి .. పేమతో పలకరించి ... కాఫీ ఇచ్చి మరీ పంపించారు. ఇండస్ట్రీలో 'అన్నా' అంటే 'నేనున్నా' అనే వ్యక్తి చిరంజీవిగారే. మనస్ఫూర్తిగా ఆయనకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక మీరంతా కూడా మీ పనులను పక్కన పెట్టి, మా సినిమా కోసం ఇక్కడికి వచ్చారు. మీరంతా నా బలం ... నా ధైర్యం .. నా సైన్యం. మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించారు.