Begin typing your search above and press return to search.
డిక్టేటర్ పై ఆ ఎఫెక్ట్ బాగానే పడుద్ది
By: Tupaki Desk | 29 Dec 2015 10:30 PM GMTఒక్క సినిమాకు నలుగురు పేరున్న రచయితలు పని చేయడం అరుదైన విషయం. ‘డిక్టేటర్’ విషయంలో ఇది సాధ్యమైంది. కోన వెంకట్ - గోపీ మోహన్ - శ్రీధర్ సీపాన - రత్నం.. ఈ నలుగురూ కలిసి ‘డిక్టేటర్’ స్క్రిప్టు తయారు చేశారు. ఈ నలుగురూ కలిసి పని చేయడమే ‘డిక్టేటర్’కు ముందు క్రేజ్ రావడానికి కారణమైంది. ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు కోన - గోపీ - శ్రీధర్ మాంచి ఫామ్ లో ఉన్నారు. కానీ ‘డిక్టేటర్’ విడుదలయ్యే సమయానికి ఈ ముగ్గురు స్టార్ రైటర్ల పరిస్థితి ఏమీ బాగా లేదు. వీళ్ల హ్యాండ్ ఇప్పుడు ఎంత మాత్రం రైజింగ్ లో లేదు. ముగ్గురూ కూడా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు.
ముఖ్యంగా ఈ ముగ్గురూ కలిసి స్క్రిప్టు అందించిన ‘సౌఖ్యం’ ఎఫెక్ట్ ‘డిక్టేటర్’పై చాలావరకు పడనుంది. కోన - గోపీ పెన్నుల్లో ఇంకు అయిపోయిందనడానికి ‘సౌఖ్యం’ను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు జనాలు. దీనికి ముందు కోన హ్యాండ్ పడిన బ్రూస్ లీ - అఖిల్ - త్రిపుర - శంకరాభరణం సినిమాలు కూడా బోల్తా కొట్టాయి. శ్రీధర్ సీపాన కథ - మాటలు అందించిన సౌఖ్యం - మామ మంచు అల్లుడు కంచు సినిమాల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఈ ముగ్గురు రచయితలూ మరీ రొటీన్ గా రాసేస్తున్నారన్న విమర్శలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అరిగిపోయిన వాళ్ల ఫార్ములా కథల్ని జనాలు ఏమాత్రం ఆమోదించట్లేదు. ‘డిక్టేటర్’ ట్రైలర్ చూసినా కూడా సినిమా రొటీన్ గానే ఉండేలా కనిపిస్తోంది. అదే సమయంలో సంక్రాంతి రేసులో ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ చాలా డిఫరెంటుగా కనిపిస్తోంది. ఎక్స్‌ప్రెస్ రాజా - సోగ్గాడే చిన్నినాయనా కూడా ‘డిక్టేటర్’తో పోలిస్తే కొంచెం భిన్నమైన సినిమాల్లాగే ఉన్నాయి. మరి ఈ ‘కొత్త’ సినిమాల పోటీని ‘డిక్టేటర్’ ఎలా తట్టుకుంటాడో చూడాలి.