Begin typing your search above and press return to search.
కోన కొట్టేయలేదు.. కొన్నాడు..
By: Tupaki Desk | 30 Oct 2015 11:30 AM GMTస్టార్ రైటర్ అయిన కోన వెంకట్.. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా కూడా అవతారమెత్తాడు. అయితే ఈ మధ్య కాలంలో కోన వెంకట్ పేరు బాగా ఎక్కువగా వార్తల్లో నానుతోంది. రైటింగ్ ట్యాలెంట్ తో పాటు వివాదాలు కూడా బాగానే ఉన్నాయి ఈయన చుట్టూ. ప్రస్తుతం నిఖిల్ - నందిత జంటగా.. అంజలి ప్రత్యేక పాత్రలో నటిస్తున్న శంకరాభరణం చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కోన వెంకట్. అవడానికి నిర్మాతే అయినా.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసేశాడనే విషయం.. శంకరాభరణం మేకింగ్ చూస్తే అర్ధమవుతుంది.
బాలీవుడ్ మూవీ ఫస్ గయా రే ఒబామో చిత్రాన్ని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని.. కోన టీం ఈ సినిమా కథ రాసేశారని చాలాకాలం నుంచే న్యూస్ వినిపిస్తోంది. అయితే.. ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేదు. సైలెన్స్ మెయింటెయిన్ చేశారంతే. ఇప్పుడు మాత్రం కోన ఓ డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తమ చిత్రం ఫస్ గయా రే ఒబామా నుంచి సెంట్రల్ ప్లాట్ ని స్ఫూర్తిగా తీసుకుని.. తెలుగు ప్రేక్షకులకు అనువుగా తీర్చిదిద్దామని కుండ బద్దలు కొట్టేశాడు కోన. అంతే కాదు.. ఆ చిత్రానికి సంబంధించి మొత్తం దక్షిణాది రైట్స్ తీసుకున్నామని.. ఇది ఫ్రీమేక్ కాదని తేల్చి చెప్పాడు కోన. అలాగని రీమేక్ అనడానికి కూడా ఒప్పుకోవడం లేదు లెండి. జస్ట్ కాన్సెప్ట్ వరకే తెచ్చుకున్నామని చెప్పాడు.
ఇన్నాళ్లపాటు సైలెంట్ గా ఉండి.. సరిగ్గా సినిమా సిద్ధమైన టైంలో ఈ విషయాన్ని ప్రకటించడమంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే తేడా వస్తే ఫ్యూజులు ఎగిరిగిపోతాయ్ కొన్నవాళ్లకి. అయితే.. మూవీ వచ్చిన తీరు చూసుకున్నాక సంతృప్తి చెందిన కోన.. తనపై తనకు ఉన్న నమ్మకంతోనే ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడని అనుకోవచ్చు.