Begin typing your search above and press return to search.
కోన రైటప్ లో క్లారిటీ మిస్ అయిందే
By: Tupaki Desk | 21 Jun 2016 4:15 AM GMTఓ స్టార్ రైటర్ ఒక లైన్ రాసినా చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. కంటెంట్ ఎక్కువగా లేకుండా క్లారిటీ ఇవ్వగలగాలి. క్లారిటీ కంటే ఎక్కువగా ఇంటెన్సిటీ ఉండాలి. కోన లాంటి రైటర్ నుంచి ఇలాంటివేవో ఎక్స్ పెక్ట్ చేయడం పెద్ద తప్పేం కాదు. కానీ ఇప్పుడు కోన చేసిన ఓ ట్వీట్ లో క్లారిటీ లేదనే కామెంట్స్ వస్తున్నాయి.
తన కజిన్ ఎస్ఎస్ కాంచి దర్శకత్వంలో రూపొందిన షో టైమ్ సినిమా గురించి ట్వీట్ చేసిన రాజమౌళి.. 'ఓ చిన్న సినిమా ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన ఆసక్తి కలిగించాలి. షోటైమ్ లో ఉన్నదదే' అనే భావంతో ఓ ట్వీట్ చేశాడు. దీనికి స్పందనగా ట్వీట్ చేసిన కోన వెంకట్.. 'సార్.. మా సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే రూపొందింది. దయచేసి ఇది కూడా చూడండి. థాంక్యూ' అంటూ అభినేత్రి పోస్టర్ ని పోస్ట్ చేశాడు. ఇంతకీ కోన వెంకట్ ఏం చెప్పదలచుకున్నాడన్నదే అసలు ప్రశ్న.
షో టైమ్ దర్శకుడు.. అభినేత్రిని కాపీ కొట్టాడని అంటున్నాడా? లేక తమ మూవీ కూడా ఇలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ తోనే ఉంటుందని అంటున్నాడా? ఒకవేళ కాపీ అనుకుంటుంటే మాత్రం కోనకి క్లారిటీ లేనట్లే. ఎందుకంటే షోటైమ్ మూవీ అంతా థియేటర్ లోనే ఉంటుంది. ఓ సీటుపై రక్తం మరకలతో థ్రిల్లర్ కాన్సెప్ట్ అని అర్ధమవుతోంది. కానీ అభినేత్రిలో జస్ట్ థియేటర్లో కూచుని సినిమా చూస్తున్న పనిమనిషి తమన్నా ఉంటుందంతే. ఒక వేళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం గురించి అయితే.. అది చెప్పుకుంటే వచ్చేది కాదు కదా కోనా?