Begin typing your search above and press return to search.

అవును.. వైట్లకు, నాకు మనస్ఫర్థలున్నాయి-కోన

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:30 PM GMT
అవును.. వైట్లకు, నాకు మనస్ఫర్థలున్నాయి-కోన
X
శ్రీను వైట్లతో తన వైరం గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు కోన వెంకట్. తనకు, వైట్లకు ‘బ్రూస్ లీ’ సినిమా తర్వాత కూడా మనస్పర్థలు ఉన్నాయని చెప్పాడు కోన. తాను వైట్లపై పరువు నష్టం దావా వేయాలని అనుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని.. ఐతే ‘బ్రూస్ లీ’ విషయంలో వైట్ల చేసిందానికి తాను చాలా బాధపడ్డ మాట మాత్రం వాస్తవమని కోన చెప్పాడు. ఇంకా వైట్ల గురించి కోన ఏమన్నాడో చూడండి.

‘‘నాకు, శ్రీను వైట్లకు మనస్ఫర్థలున్న మాట వాస్తవం. ైతే నేను ఆయనపై లీగల్ గా చర్యలు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదు. మనకు ఎంత పరిచయం ఉన్నా, అనుబంధం ఉన్నా ఓ రిలేషన్ షిప్ లో గొడవలు రావడం కామన్. నేనూ మనిషినే కాబట్టి ఎమోషనల్ అయ్యాను. రేపు మళ్లీ కలుసుకోవచ్చు. జరిగిందేదో జరిగిపోయిందిలే అనుకోవచ్చు. ఐతే మా మధ్య ఇప్పుడు సత్సంబంధాలైతే లేవు. బ్రూస్ లీ సినిమా కోసం 72 సన్నివేశాలు రాసిచ్చాను. ఐతే నేను రాసిన సన్నివేశాలన్నింటినీ ఉన్నదున్నట్లుగా తీసుకోవాలనేం లేదు. కానీ కథా రచయితగా నా పేరు వేయడంతోనే ఫీలయ్యాను. అందుక కారణముంది. ‘దూకుడు’ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకుడు - బయ్యర్ - డిస్ట్రిబ్యూటర్.. ఇలా అందరిలో ఓ అంచనా - నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం ఇప్పుడు పోయింది. సినిమాలో మాటలు కాదు, సక్సెస్ మాట్లాడాలి’’ అని సెలవిచ్చాడు కోన.