Begin typing your search above and press return to search.

వైట్ల ఏడ్చాడు.. నేనూ ఏడ్చేశా- కోన

By:  Tupaki Desk   |   30 Nov 2015 5:30 PM GMT
వైట్ల ఏడ్చాడు.. నేనూ ఏడ్చేశా- కోన
X
‘‘ఒక బలహీన క్షణంలో తప్పయిపోయిందని కన్నీళ్ళు పెట్టుకుంటే, నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నా. ఎంతైనా క్రియేటివ్ పీపుల్ అందరం ఎమోషనల్ కదా’’ అంటున్నాడు కోన వెంకట్. ఈ వ్యాఖ్యలు శ్రీను వైట్ల గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాద్ షా’ టైంలోనే గొడవయ్యాక మళ్లీ ‘బ్రూస్ లీ’కి ఎందుకు పని చేశారు, ఇప్పుడు మళ్లీ ఎందుకు విమర్శలు చేస్తున్నారు అని అడిగితే కోన ఇలా సమాధానం ఇచ్చాడు. ఐతే కోన వ్యాఖ్యల్లో నిజం ఉండి ఉండొచ్చు కానీ.. అతను వైట్ల మీద మరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటం ఇండస్ట్రీ జనాలకు మింగుడు పడటం లేదు.

సినీ పరిశ్రమలోనే కాదు.. ఎక్కడైనా సరే అంతర్గత విభేదాలన్నవి సహజం. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఐతే వాటి గురించి బయటికి ఎవ్వరూ మాట్లాడరు. కానీ కోన మాత్రం వైట్లకు, తనకు ఉన్న విభేదాల గురించి మరీ ఓపెన్‌ గా మాట్లాడేస్తూ సంచలనం రేపుతున్నాడు. శ్రీను వైట్ల అసలే రెండు పెద్ద డిజాస్టర్లతో దారుణంగా దెబ్బ తిని ఉన్నాడు పాపం. మీడియం రేంజి హీరోలు కూడా చిక్కని స్థితిలో అయోమయంలో ఉన్నాడు వైట్ల. ఇలాంటపుడు తన హవా నడుస్తోంది కాబట్టి వైట్లపై ఈ స్థాయిలో విరుచుకుపడటం.. ఎద్దేవా చేయడం ఎంత వరకు సబబన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.