Begin typing your search above and press return to search.
ఇదిగో ప్రూఫ్-పైరసీని ఆపండి
By: Tupaki Desk | 12 Feb 2018 12:04 PM GMTతెలుగు సినిమానే కాక తమిళ, హింది, మలయాళం సినిమా వసూళ్లను అనకొండ పాములా మింగేస్తున్న పైరసీ సైట్ల గురించి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎంత నెత్తి నోరు బాదుకున్నా ఫలితం లేకుండా పోతోంది. అంతకంతకు వికృత రూపం దాలుస్తోందే తప్ప దీన్ని అరికడుతున్న చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇలా అయితే లాభం లేదని రచయిత, నిర్మాత కోన వెంకట్ కొత్త దారి వెతికారు. పైరసీకి అడ్డాగా మారిన మూవీరూల్జ్ అనే సైట్ ని స్క్రీన్ షాట్స్ తీసి ఆధారాల రూపంలో తన ట్విట్టర్ లో పోస్ట్ చేయటమే కాక చర్యలు తీసుకోమని మంత్రి కేటిఅర్ కు ట్యాగ్ చేయటంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో మెసేజ్ పెట్టిన కోన వెంకట్ ఈ వెబ్ సైట్ తెలుగు సినిమాకు ప్రతిబంధకంగా మారిందని, వెంటనే చర్యలు తీసుకోకపోతే నష్టం ఇంకా పెరుగుతుందని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు.
ఒకవేళ కేటిఅర్ స్పందించినా స్పందించక పోయినా ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యే సమస్య కాదు. గతంలో ఇలాగే విచ్చలవిడి పైరసీకి పాల్పడుతున్నారని ఒక టొరెంట్ సైట్ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తే కొద్ది రోజుల్లోనే బ్యాన్ చేసిన వెబ్ సైట్ పేరుకి 2 అని జోడించి తిరిగి స్టార్ట్ చేయటం వీరికే చెల్లింది . పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే సినిమా నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టిన తీసుకున్న తమ సినిమాలను నెలలోపే ప్రసారం చేసేలా అమెజాన్ ప్రైమ్ లాంటి వెబ్ సైట్స్ కు అమ్మేస్తున్నాయి. దీని మీద కూడా టాలీవుడ్ లో చిన్నపాటి దుమారం రేగుతోంది.
కోన వెంకట్ ఇలా మెసేజ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. హింది ప్యాడ్ మ్యాన్ తో సహా తెలుగు లో ఇటీవలే విడుదలైన మూడు కొత్త సినిమాల లింకులు కూడా అందులో పోస్ట్ చేయటమే. విడుదలైన సాయంత్రం లోపే కనీసం టాక్ కూడా పూర్తిగా బయటికి రాకముందే ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కోన వెంకట్ ఇది చూడలేకే మెసేజ్ చేసారు. మరి కేటిఅర్ స్పందన ఎలా ఉంటుంది, అది ఎన్ని రోజులు పైరసీని నిలవరించగలదు అనేది ఆసక్తికరంగా మారింది.