Begin typing your search above and press return to search.
కోన సార్.. చాలా కళలున్నాయండీ మీలో!
By: Tupaki Desk | 25 Aug 2015 10:24 AM ISTకోన వెంకట్ సినీ ప్రస్థానం నిర్మాతగా మొదలైంది. మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కూడా చేసినట్లు చెప్పుకున్నాడు. ఆ తర్వాత రచయిత అయ్యాడు. స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ రైటర్ అనిపించుకున్నాడు. నటుడిగానూ ముచ్చట తీర్చుకున్నాడు. నిర్మాత అవతారమూ ఎత్తాడు. డైరెక్షన్ ఆఫర్ కూడా ఉంది కానీ.. ఖాళీ లేక చేయట్లేదు. ఇవన్నీ పక్కనబెడితే.. ఇప్పుడు కోన సరికొత్త అవతారం ఎత్తాడు. ఆ అవతారం ఎవ్వరూ ఊహించనిది. ఆయన కొరియోగ్రాఫర్ గా మారడం విశేషం. ఈ సంగతి హీరో నిఖిల్ ట్విట్టర్ లో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
స్క్రీన్ ప్లే అందిస్తూ.. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ‘శంకరాభరణం’ సినిమా కోసం కొరియోగ్రాఫర్ అవతారమెత్తాడు కోన. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నిఖిల్, నందిలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కోన స్వయంగా నృత్యరీతులు సమకూరుస్తున్నట్లు నిఖిల్ తెలిపాడు. కోనలోని ఈ కొత్త యాంగిల్ గురించి ఎవరికీ తెలియదు. బహుశా ఈ పాట ఆర్టిస్టిక్ గా లేదంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉండే అవకాశముంది. కథలకు స్క్రీన్ ప్లే అందించినట్లే.. ఈ పాటకు కూడా కాన్సెప్ట్ అందించాడేమో కోన. ఎలాగైతేనేం కోన కొరియోగ్రఫీ చేసిన పాట అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఉదయ్ నందనవనం అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఈ ఏడాది ఆఖర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.