Begin typing your search above and press return to search.
కోన.. బోయపాటి మీద పడ్డాడేంటి?
By: Tupaki Desk | 6 Dec 2015 4:17 AM GMTకోన వెంకట్ కు, శ్రీను వైట్లకు మధ్య అభిప్రాయ భేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ కోనకు - బోయపాటి శ్రీనుకు ఎప్పుడు చెడిందన్నదే జనాలకు అర్థం కావడం లేదు. సెటైరిక్ డైలాగులు రాయడంలో ఆరితేరిన కోన.. ‘శంకరాభరణం’ సినిమాలో ఓ డైలాగ్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి ఓ డైలాగ్ రాయడం సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో చెప్పడానికి ముందు ‘లెజెండ్’ సినిమాకు సంబంధించిన ఓ ఫంక్షన్ సందర్భంగా ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి.
లెజెండ్ సినిమాకు తాను దగ్గరుండి దేవిశ్రీ దగ్గర్నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నానని బోయపాటి శ్రీను చెప్పడంపై దేవి మంటెత్తి పోవడం గుర్తుండే ఉంటుంది. డైరెక్టర్లు సాధారణంగా మంచి సంగీతం పిండుకున్నానని అంటుంటారని.. అలా పిండుకోవడానికి తానేమైనా గేదెనా అంటూ దేవి ఫైరై పోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ డైలాగునే ‘శంకరాభరణం’ సినిమాలో వాడేశాడు కోన.
ఓ సన్నివేశంలో డైరెక్టర్ పాత్రలో కృష్ణ భగవాన్ ఎంట్రీ ఇచ్చి నటుల నుంచి తనకు పెర్ఫామెన్స్ ఎలా పిండుకోవాలో బాగా తెలుసని అంటాడు. ఈ పిండుకోవడం మీద కొన్ని సెటైరిక్ డైలాగులు పడతాయి. ఇది కచ్చితంగా బోయపాటి-దేవి గొడవను దృష్టిలో పెట్టుకుని రాసిందే అనడంలో సందేహం లేదు. ఐతే బోయపాటికి, కోనకు ఎక్కడా లింక్ అన్నదే లేదు. మరి కోన క్యాజువల్ గానే ఈ డైలాగ్ రాశాడా.. లేక బోయపాటికి అతడికి ఎప్పుడైనా ఏమైనా తేడా జరిగిందా?