Begin typing your search above and press return to search.

లాజిక్ మిస్ అయిన కోన!

By:  Tupaki Desk   |   25 Aug 2018 11:50 AM GMT
లాజిక్ మిస్ అయిన కోన!
X
సినిమా బాగుంటే వెబ్ సైట్లు బాగా విశ్లేషించినట్టు లేదూ కాస్త విమర్శ చేస్తూ ఏదైనా రాసారంటే వాళ్ల కోసం ఒక స్కూల్ పెట్టాలి అనేలా ఉంటుంది పరిశ్రమలో కొందరి వ్యవహారం. ఇది ఇంతకు ముందు వినని విషయం కాకపోయినా కొత్త సినిమా విడుదలైన ప్రతి సారి ఇది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. గత ఏడాది డీజే విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ ఎంత ఓపెన్ గా ఫైర్ అయ్యాడో అందరికీ గుర్తే. మొన్నటికి మొన్న శ్రీనివాస కళ్యాణం విషయంలో సైతం దిల్ రాజు తన సినిమా రిపోర్ట్స్ గురించి తామంతా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నామని మంచి సినిమా తీశామనే నమ్మకం ఉందని పదే పదే చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీటి ఫలితాలు ఫైనల్ గా ప్రేక్షకులు శాశించారు. అందరూ కళ్లారా చూసారు. ఇప్పుడు కోన వెంకట్ వంతు వచ్చింది. నిన్న విడుదలైన నీవెవరోకి దర్శకత్వం తప్ప కర్త క్రియ అన్ని ఈయనే. ఎంవివి బ్యానర్ తో కలిసి దీన్ని తన రచనలో స్వయంగా నిర్మించారు.

ట్రైలర్ నుంచి ప్రామిసింగ్ గానే అనిపించినప్పటికీ ఫస్ట్ షో అయ్యాక మాత్రం ఆశించిన స్పందన నీవెవరోకి అంతగా కనిపించలేదు. దానికి తోడు ఆన్ లైన్ రిపోర్ట్స్ అన్ని ఏమంత గొప్పగా లేదని రాయడంతో కోన వెంకట్ కి స్వీట్ షాక్ కలిగించినట్టుంది. అయినా దాన్ని పూర్తిగా బయటపడనివ్వకుండా అందరిని మెప్పించేలా ఏదైనా చేయటం అసాధ్యమని మనకిష్టమైన వాళ్ళు మన శ్రమను గుర్తించి మెచ్చుకుంటే అంతే చాలని ఒక ప్రేక్షకుడు 4 రేటింగ్ ఇచ్చిన కామెంట్ ని ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదంతా బాగానే ఉంది సినిమా అనేది వ్యక్తిగత వస్తువు కాదు. పబ్లిక్ ప్రాపర్టీగా మార్చి బిజినెస్ కోసం దాన్ని థియేటర్ లోకి పంపినప్పుడు అందరి అభిప్రాయాలూ బయటికి వస్తాయి. అధికశాతం బాగుంది అంటే లాభాలు వస్తాయి లేదంటే బాక్సులు వెనక్కు వస్తాయి. సింపుల్. అంతే తప్ప ఎవరో ఒకరిద్దరు మెచ్చుకున్నారని దాన్నే ప్రామాణికంగా తీసుకుని మన సినిమా హిట్ అని మన చెప్పుకోవడం కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు చెప్పాలి. అంతే కదా కోన గారు.